జూన్ 4న కమలం వికసించబోతోందన్నారు మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు. ఇవాళ ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్‌లో రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీ పాత్రికేయులు సంధించిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ను ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, బీజేపీ- బీఆర్‌ఎస్ ఒక్కటే అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 7 నుంచి 14 శాతం వరకు ఓట్లు పెంచుకున్నామన్నారు రఘునందన్ రావు. ఒక సీటు నుంచి 7 అసెంబ్లీ సీట్లకు బీజేపీ ఎదిగింది రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.
అయితే.. ఓటుకు నోటు కేసులో డబ్బులతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన రేవంత్ రెడ్డి కేసు ఎందుకు ఆలస్యంపై ఎన్టీవీ పాత్రికేయ బృందం అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ.. 2015లో జరిగిన ఓటుకు నోటు కేసు ఇప్పటి వరకు ఎందుకు ముందుకు కదలడం లేదు. ఈ కేసులో నాటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోరెన్సిక్ నివేదిక రావాలని చెబుతున్నారు.. కానీ ల్యాబ్ నివేదిక రావడానికి పదేళ్లు పడుతుందా? ఒక న్యాయవాదిగా ఇంత సమయం పట్టదని ఆయన అన్నారు.
ఓటుకు నోటు కేసులో నాటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడని నాటి మన ముఖ్యమంత్రి కూడా చెప్పారు. కానీ ఈ కేసు ఇప్పటి వరకు ముందుకు జరగకపోవడానికి కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలి. మరి కేసీఆర్, రేవంత్ కలిసి ములాఖత్ అయి తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నారా?. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌ను… బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ కాపాడుకుంటున్నాయి. అయినా చంద్రబాబు ఆడియో కావాలంటే ఫోరెన్సిక్ నివేదిక కావాలని… రేవంత్ రెడ్డి డబ్బులు పట్టుకెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడని.. ఈ అంశంపై ఛార్జిషీట్ ఎందుకు వేయలేదు.’ అని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.