2009 ఎన్నికల్లో 171 ఓట్లతో గెలిచిన కేటీఆర్.. 1700 ఓట్లతో గెలిచని నన్ను ఎక్కిరిస్తుండని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు విమర్శించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్, మంత్రి హరీష్ రావులపై ధ్వజమెత్తారు. తండ్రి, కొడుకు, అల్లుడు వరుస పట్టి దుబ్బాక వస్తున్నారు.. ఏం చేశారు? అని ప్రశ్నించారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లతో పోల్చి దుబ్బాకుకు ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం ఇస్తారా? కేసీఆర్ అంటేనే అబద్ధం, కేసీఆర్ అంటేనే మోసమన్నారు.…
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తి దాడి దుదృష్టకరం, బాధాకరం అని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.. ప్రజాస్వామ్య లో దాడులు పరిష్కారం కావు.. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
Raghunandan Rao: రేవంత్ రెడ్డి ఢిల్లీ కేసులు మాట్లాడుతున్నారు మరి గల్లీ కేసులు ఎందుకు మాట్లాడుతలేరని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక క్యాంపు కార్యాలయంలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు, అధ్యక్షులు అబద్దాల పునాదుల మీద అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
గజ్వేల్ లో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసేందుకు వెళ్తున్న కామారెడ్డి బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఏడు గంటల పాటు పోలీస్ వ్యానుల్లో తిప్పి బిచుకుంద పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఓడిపోవుడు కొత్త కాదు.. ఆయన ఎదో బ్రహ్మ పదార్ధం కాదు.. తన నియోజకవర్గంకు కనీసం ఒక్క డిగ్రీ కాలేజీ తీసుకురాలేదు అని ఆయన ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్ అనే పదాన్ని విసతృతంగా ప్రచారం చేసింది కడియం శ్రీహరినే అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
భూముల అమ్మకానికి చంద్రబాబు నాయుడు కిటికీలు తెరిస్తే.. రాజశేఖర్ రెడ్డి దర్వాజాలు తెరిస్తే.. బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ను అమ్మేస్తున్నారు అని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలో కూడా భూములను ఉంచుతలేరు.. చివరికి స్మశానం కూడా అమ్మేసారని హైకోర్టు స్టే ఇచ్చింది.
తెలంగాణలో ఒక్కసారి కూడా అసెంబ్లీని 30 రోజులు నడపక పోవడం చాలా బాధాకరం అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. నా లాంటి చిన్న సభ్యుడితో.. సీనియర్ అయిన కేసీఆర్ అనిపించుకోవడం జాలి కలుగుతుంది అని ఆయన అన్నారు. శాసన సభను నడిపించడంలో ఇబ్బంది ఏంటి అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు.