మాజీ సర్పంచులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పష్టంగా డిమాండ్ చేశారు. సర్పంచుల సంఘం పలు నెలలుగా పోరాడుతూ ఉన్న పెండింగ్ బిల్లుల మంజూరుపై ప్రెస్ ద్వారా స్పందిస్తూ, వారు చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పోలీసులు వ్యతిరేకంగా స్పందించి, అనేక ప్రాంతాలలో మాజీ సర్పంచులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు.. సీఎం కీలక వ్యాఖ్యలు ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చంపినపుడు పీడ విరగడైందని ప్రజలు సంబరాలు, దీపావళి చేసుకున్నారు.. తాజా ఎన్నికల్లో నరకాసురుడిని ఓడించామని చంద్రబాబు…
Raghunandan Rao : మాజీ మంత్రి కేటీఆర్ పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు వేశారు. కేటీఆర్ రాజకీయాలు బంద్ చేయాలని ఉంది అన్నాడని, బంద్ చెయ్యి ఎవరు వద్దు అనలేదు…అమెరికా వెళ్లిపో అంటూ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్ ప్రజలను కలిసే సమయం దొరకలేదని, మీ నాన్న 10 నెలలుగా ఫామ్ హౌస్ లో ఉన్నారు..ఏమైనా నష్టం జరిగిందా అని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ వచ్చింది ప్రజల కోసం కాదు…
రికార్డు ధరకు రాజా సాబ్ ఆడియో రైట్స్.. ఏడాదికి ఒక సినిమా రిలీజ్ ఉండేలా ప్లానింగ్ చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ ఏడాది కల్కి తో సూపర్ హిట్ అందున్నాడు. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. వాటిలో ఒకటి మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ లో హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో ఈ చిత్రం రానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్న…
SCO సమ్మిట్ కోసం పాకిస్తాన్ చేరిన జైశంకర్.. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) యొక్క కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (CHG) 23వ సమావేశం కోసం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ చేరుకున్నారు. ఇస్లామాబాద్‌లో ల్యాండ్ అయిన జైశంకర్‌కి అక్కడి అధికారులు ఆహ్వానం పలికారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కాశ్మీర్, సీమాంతర ఉగ్రవాదం వంటి సమస్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దాదాపుగా 9 ఏళ్ల తర్వాత…
GHMC Council Meeting: ఈరోజు ఉదయం 10 గంటలకు బల్దియా కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే గందరగోళంగా మారింది.
జూన్ 9న వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో పదవుల కోసం రాష్ట్ర బీజేపీలో తీవ్ర లాబీయింగ్ మొదలైనట్లు సమాచారం. రాష్ట్రంలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది మరియు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడానికి చాలా మంది ఎంపీలు లాబీయింగ్ ప్రారంభించినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన ఇద్దరు ఎంపీలకు ప్రధాని మోడీ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక ఎంపీకి కేబినెట్ హోదాలో,…
పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని సమాజానికి తెలుసు అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సొంత జిల్లాల్లో ఎమ్మెల్సీ, ఎంపీ గెలిపించుకోలేని రేవంత్ రెడ్డి పొంకణాలు కొడుతున్నారని, నేను ఎవరి దయాదాక్షణ్యాల మీద గెలవలేదన్నారు. మల్కాజ్ గిరి సీటు ఎంతకు అమ్ముకున్నావు రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు రఘునందన్ రావు. సిట్టింగ్ సీటు మల్కాజ్ గిరి ఓడిపోతే మాట్లాడని రేవంత్ రెడ్డి…
గత ప్రభుత్వం కూడా ఇదే అహంకారంతో ఎన్నికలకు పోయి బొక్క బోర్లా పడింది.. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అదే పరిస్థితి వస్తుందని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. ఆరు నెలల క్రితం అడ్డగోలు హామిలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు.. పూటకో మాట మాట్లాడే కాంగ్రెస్ పార్టీకి చదువుకున్న విజ్ఞులు ఓటు వేయకుండా గుణపాఠం చెప్పాలన్నారు.