గాజాలో ఆదివారం సహాయ పంపిణీ దగ్గర జరిగిన కాల్పుల్లో 31 మంది చనిపోయారు. పదుల కొద్దీ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆకలితో అలమటిస్తున్న ప్రజలను ఇజ్రాయెల్ ఊచకోత కోసిందంటూ హమాస్ తీవ్ర ఆరోపణలు చేసింది.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలోని తమ ప్రభుత్వ అధిపతి ఇస్సామ్ అల్-దాలిస్ సహా పలువురు ఉన్నతాధికారులు మరణించారని హమాస్ ధృవీకరించింది . ఈ దాడుల్లో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధిపతి మహమూద్ అబు వాట్ఫా, అంతర్గత భద్రతా సేవ డైరెక్టర్ జనరల్ బహ్జత్ అబు సుల్తాన్ కూడా తుది శ్వాస విడిచారు. కీలక నాయకులు, వారి కుటుంబాలతో పాటు జియోనిస్ట్ ఆక్రమణ దళాల విమానాల ప్రత్యక్ష దాడిలో అమరులయ్యారని హమాస్ ప్రకటనలో పేర్కొంది. తాజా ఉద్రిక్తత…
Yahya Sinwar: హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో చనిపోయారు. తాజాగా ఆయనకు సంబంధించిన రహస్య బంకర్ వీడియోను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది.
Israel Attack : ఇజ్రాయెల్ దళాలు శుక్రవారం రఫా నగరం ఉత్తర భాగంలో వలస వచ్చిన పాలస్తీనియన్ల కోసం నిర్మించిన శిబిరాలపై దాడి చేశాయి. ఈ దాడుల్లో కనీసం 25 మంది మరణించారు.. మరో 50 మంది వరకు గాయపడ్డారు.
Israel Strike On Rafah: గాజా స్ట్రిప్‌లోని రఫాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇప్పటికే గాజా నగరంపై దాడి చేసిన ఇజ్రాయిల్, హమాస్ నాయకులుకు రక్షణగా నిలుస్తుందంటూ రఫాపై దాడి చేస్తోంది.
రఫాపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడిలో అమాయక పాలస్తీనియన్లు చనిపోవడం బాధకరం అని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో దాడి చేసి తప్పు చేశామని పార్లమెంటులో ప్రకటించారు.
రఫాలో ఇజ్రాయెల్ దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 45 మంది సామాన్య పౌరుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనపై విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ ప్రభుత్వ చర్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
Israel Attack : గాజా, ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం ఆగడం లేదు. ఇప్పుడు దక్షిణ గాజాలోని రఫా నగరం రణరంగంగా మారిపోయింది. గాజాలో దాడుల తరువాత, పాలస్తీనియన్లు దక్షిణ గాజాలోని రఫా నగరంలో ఆశ్రయం పొందారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడి చేయవద్దని అమెరికా, ఇతర దేశాలు ఒత్తిడి చేస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. రఫాలో పాలస్తీయన్ ప్రజలు ఖాళీ చేయాలని, సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని మరోసారి ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది.