ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలోని తమ ప్రభుత్వ అధిపతి ఇస్సామ్ అల్-దాలిస్ సహా పలువురు ఉన్నతాధికారులు మరణించారని హమాస్ ధృవీకరించింది . ఈ దాడుల్లో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధిపతి మహమూద్ అబు వాట్ఫా, అంతర్గత భద్రతా సేవ డైరెక్టర్ జనరల్ బహ్జత్ అబు సుల్తాన్ కూడా తుది శ్వాస విడిచారు. కీలక నాయకులు, వారి కుటుంబాలతో పాటు జియోనిస్ట్ ఆక్రమణ దళాల విమానాల ప్రత్యక్ష దాడిలో అమరులయ్యారని హమాస్ ప్రకటనలో పేర్కొంది. తాజా ఉద్రిక్తత రెండు నెలల కాల్పుల విరమణను దెబ్బతీసిన విషయం తెలిసిందే. హమాస్ బందీలను విడుదల చేయడానికి నిరాకరించడం, కాల్పుల విరమణ ప్రతిపాదనలను తిరస్కరించడం ద్వారా ఇజ్రాయెల్ దళాలు సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేశాయి.
READ MORE: Viral video: ‘‘నన్ను మోసం చేసి, కొత్త భార్యకు ఫోన్ కొంటున్నావా?’’.. వ్యక్తిపై గర్ల్‌ఫ్రెండ్ దాడి..
ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపై చర్చలకు సిద్ధమవుతుండగా.. గాజాపై టెల్‌అవీవ్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. సోమవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో జరిపిన ఈ భీకర దాడుల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు కనీసం 330పైగా మృతి చెందినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. మృతుల్లో అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నట్లు ఏజెన్సీ పేర్కొంది. ఈ దాడుల కారణంగా మరో 150 మందికి పైగా గాయపడినట్లు తెలిపింది. ఖాన్ యూనిస్, రఫా, ఉత్తర గాజా, గాజా సిటీ ప్రాంతాల్లో ఈ వైమానిక దాడులు చోటుచేసుకున్నాయి. గాజా స్ట్రిప్‌లో జరిగిన దాడుల్లో హమాస్ పోలీస్, ఇంటర్నల్ సెక్యూరిటీ సర్వీసెస్ హెడ్ మహ్మద్ అబు వత్ఫా కూడా మరణించినట్లు తెలిసింది.
READ MORE: CM Chandrababu: సీఆర్డీఏ అధికారులతో సీఎం సమీక్ష.. ప్రధాని మోడీ పర్యటనపై చర్చ..