బిబిసి స్టూడియోస్ నిర్మించిన ఒక యురోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన’ అనే ఒరిజినల్ సిరీస్ గా నిర్మిస్తోంది జీ 5 సంస్థ. బి.బి.సి. స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో ఇది రూపుదిద్దుకుంటోంది. ఇందులో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్, సాయి కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చాందినీ చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, తాగుబోతు రమేష్, జ్యోతి ప్రదీప్, ఆశ్రిత వేముగంటి ఇతర తారాగణం. 50…
తెలుగు చిత్రసీమలో బాపు తీతకు, ముళ్ళపూడి వెంకటరమణ రాతకు విశేషస్థానముంది. వారి జోడీ సాంఘికం తీసినా, పౌరాణికం తెరకెక్కించినా, రీమేక్స్ అందించినా జనం అభిమానించారు, ఆదరించారు. స్ట్రెయిట్ మూవీస్ తోనే కాదు, పరభాషల్లో విజయం సాధించిన చిత్రాలకు తెలుగుదనం అద్ది అందించడంలోనూ బాపు-రమణ తమదైన బాణీ పలికించారు. అలా వారి అద్దకంలో వెలుగు చూసిన చిత్రాల్లో ‘రాధా కళ్యాణం’ ఒకటి. తమిళంలో భాగ్యరాజా స్వీయదర్శకత్వంలో నటించిన ‘అంద 7 నాట్కల్’ చిత్రం ఆధారంగా ఈ ‘రాధా కళ్యాణం’…
దేశవ్యాప్తంగా విజయ దశమి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దసరాగా పిలవబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ ‘నవరాత్రి స్పెషల్’ డే ను పురస్కరించుకొని ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో నటిస్తున్న సీనియర్ నటి రాధికా, ఊర్వశి ఓ వీడియోను పంచుకున్నారు. ఈ ‘నవరాత్రి.. శుభరాత్రి..’ అంటూ కథానాయికగా నటిస్తున్న రష్మిక మందానతో అలనాటి సావిత్రిని తపిస్తూ వీడియో…
చూడముచ్చటైన జంట అంటూ వేనోళ్ళ కీర్తించిన నాగచైతన్య, సమంత జంట విడాకులు తీసుకుంది. గత కొద్ది రోజులుగా చైతూ, సామ్ విడిపోతారని వినిపిస్తూనే ఉంది. అయితే శనివారం అధికారికంగా వారిద్దరూ విడిపోయినట్టు నాగచైతన్య తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నాడు. ఆ వెంటనే సమంత సైతం తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. టాలీవుడ్ ఓ స్టార్ జంట విడిపోవడం కొత్తేమీ కాదు. సినిమా జంటలు పెళ్ళయ్యాక బ్రేకప్ అయినవి కొన్ని అయితే, కొందరు వివాహ…
ఒక్క రోజు ఖాళీగా కూర్చోకుండా, క్షణం తీరిక లేకుండా గడిపేవారు కూడా గత రెండు సంవత్సరాల్లో నెలల తరబడి ఇళ్లకు పరిమితం అయ్యారు. సినిమాల సంగతి సరేసరి! రిలీజ్ లు లేక, షూటింగ్ లు లేక బిజీ ఆర్టిస్ట్స్ అంతా బోర్ గా ఫీలయ్యారు. అయితే, ఇప్పుడు సీన్ మారింది. క్రమంగా షూటింగ్ ల జోరు పెరుగుతోంది. దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందిస్తోన్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా కూడా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. మరి…