దేశవ్యాప్తంగా విజయ దశమి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దసరాగా పిలవబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ ‘నవరాత్రి స్పెషల్’ డే ను పురస్కరించుకొని ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో నటిస్తున్న సీనియర్ నటి రాధికా, ఊర్వశి ఓ వీడియోను పంచుకున్నారు. ఈ ‘నవరాత్రి.. శుభరాత్రి..’ అంటూ కథానాయికగా నటిస్తున్న రష్మిక మందానతో అలనాటి సావిత్రిని తపిస్తూ వీడియో షేర్ చేశారు. ఈ సినిమాలో మహిళల గొప్పతనాన్ని దర్శకుడు కిశోర్ తిరుమల చూపించనున్నారు.
A #Navaratri special with the doll @iamRashmika a #favourite song reminiscing #savithri #amj aadavallu meeku joharllu special😀😀😀 pic.twitter.com/ACMCiEbVw5
— Radikaa Sarathkumar (@realradikaa) October 7, 2021
నవరాత్రి సినిమాలో.. సావిత్రి (రాధ) నవరాత్రులలో తొలిరోజు రాత్రిపూట బొమ్మలకొలువు పేరంటం స్నేహితురాళ్ళతో కలిసి చేస్తుంది. నవరాత్రి శుభరాత్రి నెలరాజు చిగురించే కొలువుతీరే రాత్రి అని బొమ్మలను చూపుతూ వాటి విశేషాలు తెలియచేస్తూ, చంద్రుని బొమ్మలో సావిత్రిని చూపుతూ, దీపాలు, లైట్ల వెలుగులో అద్భుతంగా ఈ పాటను చిత్రీకరించారు.