యూవీ క్రియేషన్స్ కు కొత్త తలనొప్పి స్టార్ట్ అయ్యింది. యంగ్ రెబల్ స్టార్ అభిమాని ఒకరు సోషల్ మీడియా వేదికగా సూసైడ్ నోట్ రాస్తూ యూవీ క్రియేషన్స్ తన చావుకి కారణమని చెప్పడంతో పాటు సదరు నిర్మాణ సంస్థను, ప్రభాస్ ను ట్యాగ్ చేశాడు. “ఈ లెటర్ రాసింది ఒక రెబెల్ స్టార్ ఫ్యాన్ అయినా కానీ ప్రతీ రెబెల్ స్టార్ ఆవేదన ఇది అని అర్ధం చేసుకోండి” అంటూ ప్రభాస్ అభిమాని ట్విట్టర్ లో పోస్ట్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నేటితో 19 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు స్పెషల్ పోస్టర్లు, #19YearsForPrabhas అనే హ్యాష్‌ట్యాగ్‌తో సంబరాలు చేసుకుంటున్నారు. సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ అనతికాలంలోనే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. దర్శకుడు జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన “ఈశ్వర్” చిత్రం 2002 నవంబర్ 11న విడుదలైంది. ఈ సందర్భంగా…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీమ్స్ తో మిగతా హీరోలతో పోలుస్తూ రచ్చ చేస్తున్నారు. టాలీవుడ్ లో గత వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు కళ్ళకు కన్పించడం లేదా ? అన్నట్టుగా మీమ్స్ తోనే నిలదీస్తున్నారు. అయితే ఈ గోలంతా ప్రభాస్, మహేష్ సినిమాల గురించే. ఈ నిలదీత ఇద్దరు స్టార్ హీరోల మేకర్స్ ను ఉద్దేశించే. గత…
‘రాధే శ్యామ్’ 2022 సంక్రాంతికి సినిమాల్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రొమాంటిక్ డ్రామాలలో ఈ చిత్రం ఒకటి. ఈ సినిమాలోని ఓ హైలెట్ సీన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో కొంతభాగం షూటింగ్ జార్జియా లో జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ సెట్ కోసం మేకర్స్ దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. ప్రబాస్, పూజా హెగ్డేతో పాటు అక్కడ కొన్ని కీలక…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాలలో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ముందు వరుసలో ఉన్నాయి. రాబోయే సంక్రాంతి పండుగ సీజన్ లో రెండు సినిమాలూ క్లాష్ కాబోతున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” జనవరి 7న థియేటర్లలోకి రానుంది. మరోవైపు ప్రభాస్, పూజా హెగ్డేల “రాధే శ్యామ్” చిత్రం జనవరి 14న బిగ్ స్క్రీన్‌ల పైకి రానుంది. దేశవ్యాప్తంగా అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఈ సినిమా గురించి…
ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ సంక్రాంతి విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్ అభిమానులలో భారీ అంచనాలకు తెరలేపింది. ఇందులో ప్రభాస్ పాతకాలపు ప్రసిద్ధ పామిస్ట్‌గా పరిచయం అయ్యాడు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వాస్తవానికి నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే దానికి పూర్తిగా కమర్షియల్ హంగులు జోడించి తీసినట్లు వినికిడి. 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఐరిష్ హస్తసాముద్రికకారుడు చెయిరో జీవితం స్ఫూర్తితో దీనిని తీశారట. చెయిరోగా…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. 1970లో యూరప్ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాను ‘ప్రభాస్ 20’ పేరుతో 2018 సెప్టెంబర్ 5న ప్రారంభించారు. సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు మూడేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఇంకా విడుదల కాలేదు. ఒకానొక సమయంలో ప్రభాస్ అభిమానులు సినిమా ఇంకెంతకాలం తీస్తారంటూ మేకర్స్ పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. మరికొంత మంది సెటైర్లు పేల్చారు. ఏదైతేనేం మొత్తానికి సినిమా…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 23న ఉదయం 11 గంటల సమయంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘రాధే శ్యామ్’ టీజర్ అభిమానులందరినీ ఉర్రూతలూగించింది. అద్భుతమైన విజువల్స్, విక్రమాదిత్య పాత్ర మిస్టరీ, ఆసక్తికరమైన హీరో పాత్ర పరిచయం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లో ప్రధాన హైలైట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం “రాధేశ్యామ్” టీజర్ యూట్యూబ్…
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఈరోజుతో ఆయనకు 42 ఏళ్లు. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. ఆయన తండ్రి సినీ నిర్మాత ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ రాజు, తల్లి శివ కుమారి. ప్రభాస్ కు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. ప్రభాస్ కుటుంబానిది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని మొగల్తూరు. తన పెదనాన్న కృష్ణంరాజు బాటలో నటుడిగా పయనించాలని నిర్ణయించుకుని సినిమా ఇండస్ట్రీలోకి 2002లో ‘ఈశ్వర్’…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఈరోజు ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, టీజర్లోని సీన్స్, ప్రభాస్ చెప్తున్న ఒక్కో డైలాగ్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే 100కే లైక్స్…