యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఈరోజు ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, టీజర్లోని సీన్స్, ప్రభాస్ చెప్తున్న ఒక్కో డైలాగ్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే 100కే లైక్స్ సాధించడం విశేషం. టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. అయినప్పటికీ ‘రాధేశ్యామ్’ టీజర్ ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేయలేకపోవడం గమనార్హం.
Read Also : రాధేశ్యామ్ టీజర్ : విక్రమాదిత్య మనలో ఒకడు కాదు…!
ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న “ఆర్ఆర్ఆర్” విడుదలైతే ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడే అవకాశం ఉంది. అయితే ప్రభాస్ మాత్రం ఇప్పటికే మూడు సినిమాలు చేశాడు. ఆయనకు దేశవ్యాప్తంగా కాదు ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కూడగట్టుకున్నారు. పైగా ‘రాధేశ్యామ్’ టీజర్ మోస్ట్ అవైటెడ్ అని చెప్పొచ్చు. చాలాకాలంగా ఈ టీజర్ కోసం రెబల్ స్టార్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ ‘రాధేశ్యామ్’ టీజర్ ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేయకపోవడం గమనార్హం.
విషయంలోకి వస్తే… ‘రాధేశ్యామ్’ టీజర్ టాలీవుడ్ ఫాస్టెస్ట్ 100కే లైక్డ్ టీజర్ కావడానికి 22 నిముషాలు తీసుకుంది. కానీ ‘రామరాజుఫర్ భీం” అంటూ “ఆర్ఆర్ఆర్” టీం ఎన్టీఆర్ ను పరిచయం చేసిన “కొమురం భీమ్” ఇంట్రో టీజర్ కేవలం 7 నిమిషాల్లోనే ఈ ఫీట్ సాధించింది. తరువాత స్థానాల్లో వరుసగా వకీల్ సాబ్ 8 నిముషాలు, సరిలేరు నీకెవ్వరు 18 నిముషాలు, భీం ఫర్ రామరాజు టీజర్లు 20 నిముషాలతో టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 100కే లైక్స్ సాధించిన టీజర్లు గా నిలిచాయి. ‘రాధేశ్యామ్’ వీటన్నింటినీ దాటుకోలేకపోయింది కానీ ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచింది. ‘రాధేశ్యామ్’ తరువాత సాహో, ఆచార్య, పుష్ప నిలిచాయి.