యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న రొమాంటిక్ పాన్ ఇండియా ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. ఇప్పటివరకు పోస్టర్లు, ఫిబ్రవరి 14న గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్ పేరుతో ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఆ తరువాత ఇప్పటి వరకు ‘రాధేశ్యామ్’ నుంచి అప్డేట్ రాకపోవడంతో అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆందోళనకు గురి చేసేలా ‘రాధేశ్యామ్’ రీషూట్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.…