‘రాధే శ్యామ్’ 2022 సంక్రాంతికి సినిమాల్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రొమాంటిక్ డ్రామాలలో ఈ చిత్రం ఒకటి. ఈ సినిమాలోని ఓ హైలెట్ సీన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో కొంతభాగం షూటింగ్ జార్జియా లో జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ సెట్ కోసం మేకర్స్ దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. ప్రబాస్, పూజా హెగ్డేతో పాటు అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. జార్జియా షెడ్యూల్‌లో ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో దాదాపు 150 మంది వ్యక్తులు 10 రోజుల పాటు భారీ ఫ్లీ మార్కెట్ సెట్‌ను నిర్మించారు. ఈ సెట్ లో మేకర్స్ ఛేజ్ సీక్వెన్స్‌ని సింగిల్ షాట్‌లో చిత్రీకరించారు.
Read Also : “అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే” ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో
తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెన్స్‌లో ఛేజింగ్ సమయంలో ప్రభాస్ పరిగెత్తవలసి ఉంటుంది. ఫ్లీ మార్కెట్ బ్యాక్‌డ్రాప్‌లో జార్జియాలో చిత్రీకరించిన ఈ యాక్షన్ సీన్ కోసం ప్రభాస్ ఎక్కడా ఆగకుండా కిలోమీటరు దూరం పరుగెత్తాల్సి వచ్చిందట. ‘ట్రాన్స్‌ఫార్మర్స్’ ఫేమ్ కెన్నీ బేట్స్ ఈ చేజ్ సీక్వెన్స్‌లకు కొరియోగ్రఫీ చేశారు. 1970ల కాలం నాటి ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతుండగా, ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. యూవి క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ జనవరి 14న థియేటర్లలోకి రానుంది.