‘రాధే శ్యామ్’ చెయిరో బయోపిక్ నా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ సంక్రాంతి విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్ అభిమానులలో భారీ అంచనాలకు తెరలేపింది. ఇందులో ప్రభాస్ పాతకాలపు ప్రసిద్ధ పామిస్ట్‌గా పరిచయం అయ్యాడు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వాస్తవానికి నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే దానికి పూర్తిగా కమర్షియల్ హంగులు జోడించి తీసినట్లు వినికిడి. 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఐరిష్ హస్తసాముద్రికకారుడు చెయిరో జీవితం స్ఫూర్తితో దీనిని తీశారట. చెయిరోగా ప్రఖ్యాతి గాంచిన విలియం జాన్ వార్నర్ తన హస్తసాముద్రికం, సంఖ్యాశాస్త్రంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఐరిష్ జ్యోతిష్కుడు.
Read Also : మరో మైలు రాయిని దాటిన “సర్కారు వారి పాట” బ్లాస్టర్
Also Read
- AK47 : 'ఆదర్శ కుటుంబం' ఫస్ట్ సింగిల్ 'నారాయణమ్మ'.. ఈరోజైన వస్తుందా?
- Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
- Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
రాజుల మరణాలతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంఘటనలు అంచనా వేయటంలో ఇతగాడు ఎంతో ప్రసిద్ది చెందాడు. 1880లో భారతదేశంలో జ్యోతిషశాస్త్ర నైపుణ్యాన్ని నేర్చుకున్న చెయిరో జీవితంతో ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయంగా పలు సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు ‘రాధేశ్యామ్’లో ఈ ప్రసిద్ధ పామిస్ట్ కథలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారట. ఇప్పటికే ఫస్ట్ లుక్స్, టీజర్ తో ఆకట్టుకున్న ‘రాధేశ్యామ్’ సినిమాగానూ అలరిస్తుందని భావిస్తున్నారు. ఇందులో పూజా హేగ్డే కథానాయిక కాగా యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
తాజావార్తలు
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
-
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?