మాటను పట్టుకొని సినిమా బాట పట్టినవారు ఎందరో ఉన్నారు. వారిలో కొందరే విజయం సాధించారు. కొందరు మాటలు పలికించడంతో పాటు, తెరపైనా గిలిగింతలు పెట్టారు. వారిలో రావి కొండలరావు సైతం స్థానం సంపాదించారు. రచయితగా, జర్నలిస్టుగా, నాటకరచయితగా ఇలా సాగిన తరువాతే చిత్రసీమ బాటపట్టారు రావి కొండలరావు. తరువాత చిత్రసీమలోనూ తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి అలరించారాయన. రావి కొండలరావు తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోటలో 1932 ఫిబ్రవరి 11న జన్మించారు. రావి కొండలరావు తండ్రి…