“ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియెల్లో…” అనే పాట వినగానే నటుడు,నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి గుర్తుకు వస్తారు. ఇక ఆయన పేరు తలచుకోగానే ఎర్రజెండా సినిమాలే స్ఫురిస్తాయి. మాదాల రంగారావు తరువాత ‘రెడ్’ మూవీస్ కు అసలు సిసలు క్రేజ్ సంపాదించి పెట్టిన ఘనత నిస్సందేహంగా ఆర్.నారాయణ మూర్తిదే! చిన్నతనం నుంచీ మట్టివాసన గట్టిగా తెలిసిన వాడు కావడంతో మట్టిమనిషిలా జీవించాలని తపిస్తారు. ఏ హంగూ, ఆర్భాటమూ ఆయనకు ఇష్టం ఉండవు. అతి సామాన్యునిలా జీవిస్తారు. ఇప్పటికీ హైదరాబాద్…
ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయం ఇంకా నానుతూనే ఉంది. సంక్రాంతి వరకైనా ప్రభుత్వం ఈ విషయంలో కనికరిస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు మేకర్స్. చాలాచోట్ల ఇప్పటికే థియేటర్లు కూడా మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుతాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నించగా, అపాయింట్మెంట్ దొరకలేదని టాక్ విన్పిస్తోంది. అయితే తాజాగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానిని మచిలీపట్టణంలో ఇద్దరు…
రైతు బంధుతో కేసీఆర్ దేశానికి ఆదర్శంగా, దిక్సూచిలా నిలిచారని ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 36 ఏళ్లుగా దేశంలోని సమస్యల మీద కవులు, కళాకారులు, మీడియా స్పందించినట్లు మాదిరిగా సినిమా మాద్యమం ద్వారా తాను స్పందిస్తున్నానని తెలిపారు. అర్ధరాత్రి స్వతంత్రం నుండి అన్నదాత సుఖీభవ వరకు 36 సినిమాలు తీశానని..ఈ నెల 14న 37వ సినిమా “రైతన్న” విడుదలవుతుంది.. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టాలు,…
ప్రముఖ నిర్మాతలు, నిర్మాణ సంస్థలు తమ చిత్రాలను ఓటీటీ ద్వారా విడుదల చేయడాన్ని ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్. నారాయణమూర్తి తప్పు పట్టారు. ఇవాళ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కేవలం ఇరవై ఐదు శాతం మందికే అందుబాటులో ఉన్నాయని, కొన్ని చిత్రాలను ఓటీటీలో విడుదల చేయడం వల్ల మిగిలిన 75 శాతం మంది ఆ వినోదాన్ని పొందలేకపోతున్నారని అన్నారు. ఇటీవల సురేశ్ బాబు ‘నారప్ప’ సినిమాను ఓటీటీలో విడుదల చేశారని, దానిని కూడా కొద్ది మంది మాత్రమే…
పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి మీద ఇటీవల సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆయన ఆర్థికంగా చితికి పోయారని, ఉండటానికి సొంత ఇల్లు కూడా లేక హైదరాబాద్ శివార్లలో అద్దె ఇంట్లో ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ‘రైతన్న’ సినిమా ప్రివ్యూ సందర్భంగా గద్దర్ మాట్లాడిన మాటలను అందుకు వారు ఆధారంగా చూపిస్తున్నారు. అయితే ఈ పుకార్లను ఆర్. నారాయణమూర్తి ఖండించారు. గద్దర్ తన గురించి ప్రేమతో, అభిమానంతో అలా చెప్పారే కానీ తాను…
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం ‘రైతన్న’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆదివారం రైతు నాయకుల కోసం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో దీనిని ప్రదర్శించారు. ‘రైతన్న’ సినిమాను వీక్షించిన వారిలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోదండ రెడ్డి, సీపిఐ నాయకులు చాడా వెంకట్ రెడ్డి, సిపీఎం నాయకులు మధు, టిఆర్ఎస్ నాయకులు…
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘ఛలో రాజ్ భవన్’ కార్యక్రమం నిర్వహించారు. వాళ్లకు మద్దతుగా ఆ ర్యాలీలో ఉద్యమాల సినీనటుడు ఆర్. నారాయణమూర్తి కూడా పాల్గొన్నారు. పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేసిన.. రాజ్ భవన్‌కు వెళ్లడానికి ప్రయత్నించిన ఆందోళనాకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆర్. నారాయణ మూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోపలికి వెళ్లేందుకు…