Deputy CM Pawan Kalyan: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది.. వివిధ ఆలయాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై ఫోకస్ పెట్టింది.. కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. క్యూ లైన్ల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, భద్రతాపరమైన అంశాలపై తగిన చర్యలు…
తిరుమల కొండపైన భక్తుల రద్దీ భారీగా పెరుగుతుంది. వరుస సెలవులు ఉండటంతో ఒక్కసారిగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో పూర్తిగా నిండిపోయి క్యూలైన్ దాదాపు కిలో మీటరు మేరకు శిలాతోరణం వరకు భారీగా వేచి ఉన్నారు.
తిరుమల భక్త జనసంద్రంగా మారింది. రోజూ లక్షకు తగ్గకుండా భక్తులు తిరుమలకు వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పైగా పడుతోంది. శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు 87,698 మంది భక్తులు. తలనీలాలు సమర్పించారు 48,804 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ.3.88 కోట్లు అని టీటీడీ తెలిపింది. దీంతో ఏడుకొండలపై ఎటూ చూసినా గోవింద నామస్మరణమే. భక్తులతో సందడి సందడిగా మారింది.…