నాలుగేళ్ల క్రితం అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీని హతమార్చింది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా సమాధి దగ్గర నివాళులు అర్పించేందుకు ప్రజలు గుమికూడిన సమయంలో రెండు పెద్ద బాంబు పేలుళ్లు ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పేలుడులో కనీసం 100 మందికి పైగా మరణించగా.. 170 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. జనవరి 3, 2020న ఇరాక్ రాజధాని బాగ్దాద్ సమీపంలో ఖాసిం సులేమానీని అమెరికా చంపినప్పుడు, కాన్వాయ్‌లోని రెండు కార్లు…
ఇరాన్‌లోని కెర్మాన్ నగరంలో బుధవారం జరిగిన రెండు పేలుళ్లలో 100 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు. జనరల్ ఖాసిం సులేమాని వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పేలుళ్లు జరిగాయి. 2020లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో సులేమానీ మరణించారు. అతను రివల్యూషనరీ గార్డ్స్ ఎలైట్ ఖుద్స్ ఫోర్స్‌కు అధిపతి. ఆయనను కెర్మాన్‌లో ఖననం చేశారు.
ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ హత్యకు గురై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఆయన సమాధి సమీపంలో జరిగిన రెండు శక్తివంతమైన బాంబు పేలుళ్లలో కనీసం 73 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.