టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తాను చేసిన మంచి గురించి చెప్పే దమ్ము లేదని ఆరోపించారు. కొంత మంది మాజీ అధికారులను ప్రభుత్వంపై విషం చిమ్మెలా ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. పీవీ రమేష్ ఐఏఎస్గా పని చేశాడు.. ఇంత దిగజారి ప్రవర్తించాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ రమేష్ తండ్రి సుబ్బారావు మాస్టర్ గారు కొందరు రైతులతో కలిసి ఉమ్మడిగా లీజుకు ఇచ్చారన్నారు. 70 ఎకరాల పొలాన్ని…
డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఐఏఎస్ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేష్ పై నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం సంక్షేమ పథకాలు ఇస్తుంటే.. మాజీ ఐఏఎస్‌లు ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్ వంటి వారికి నచ్చడం లేదేమో..? మాజీ ఐఏఎస్ ఎస్సార్ శంకరన్ పేదల కోసం ఏం చేశారో గమనించాలి. ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్ పేదలను అగర్భ శత్రువులుగా చూస్తున్నారు. ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్…
ఏపీలో జగన్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల. ఉద్యోగులను వాడుకుని వదిలేయడంలో జగన్ టాప్. అవసరం తీరే వరకే అన్న.. అవసరం తీరాక దున్న అన్నట్లు జగన్ వైఖరి.ఉద్యోగులు, పోలీసుల పట్ల జగన్ వ్యవహారం దుర్మార్గం. ప్రతిపక్షాల అక్రమ అరెస్టులకు అడ్డగోలుగా వాడుకుని.. అవమానకర రీతిలో సవాంగ్ ను గెంటేశారని మండిపడ్డారు. డీజీపీ స్థాయి వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వకుండా అవమానించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను అన్నా అంటూనే.. గెంటారు. పీవీ…
ఏపీ పాలనా వ్యవహారాల్లో కొత్త మార్పులకు జగన్ శ్రీకారం చుట్టారా? అంటే అవుననే అనిపిస్తోంది. తాజా పరిణామలను పరిశీలిస్తే వాస్తవం అర్ధం అవుతుంది. తనకు అత్యంత విధేయుడిగా వుండే డీజీపీ గౌతమ్ సవాంగ్ ని బదిలీ చేయడం సంచలనం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై బదిలీ వేటు వేయడం వెనుక ఏం జరిగిందోనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గౌతమ్ సవాంగ్ ని మారుస్తారని ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం తర్వాత వార్తలు వచ్చాయి. అవి…
మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ అరెస్ట్‌కు ఏపీ పోలీసుల యత్నం అన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. సీమెన్స్ కేసులో తమకు తెలిసిన సమాచారం ఇవ్వాలంటూ అప్పటి అధికారులకు ప్రశ్నావళి ఇవ్వడానికి వెళ్ళిన డీఎస్పీ. దర్యాప్తునకు అవసరమైన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం. దీన్ని వక్రీకరించి అరెస్టుకు యత్నం అంటూ ప్రచారం దురదృష్టకరం అని అధికారులు వివరణ ఇచ్చారు, పీవీ రమేష్ అరెస్టు అనేది అవాస్తవం. ఆయన ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో అధికారులు తిరిగి వచ్చేశారు. పీవీ రమేశ్…