రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై దాడి అంశాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి చేసిందంటూ ఇటీవల రష్యా సైనిక అధికారులు.. అమెరికాకు ఆధారాలు సమర్పించింది. తాజాగా ఇదే అంశంపై ఆదివారం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ట్రంప్ స్పందించారు.
ఇది కూడా చదవండి: PM Modi: సోమనాథ్.. కోట్లాది మంది ఆత్మశక్తి.. ప్రధాని మోడీ ప్రత్యేక వ్యాసం!
పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి చేయలేదని తేల్చిచెప్పారు. పుతిన్ నివాసాన్ని ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకోలేదని అమెరికా జాతీయ భద్రతా అధికారులు నిర్ధారించినట్లు పేర్కొన్నారు. కీవ్ దాడికి యత్నించినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని యూఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా వెల్లడించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నాటో దేశాలు కూడా తోసిపుచ్చాయి. తాజాగా ట్రంప్ కూడా ఖండించారు. పుతిన్ నివాసంపై దాడి జరిగినట్లుగా తాను కూడా నమ్మడం లేదన్నారు. తన ఇంటిపై దాడి జరిగిందని పుతిన్ అన్నారని.. అటు తర్వాత అమెరికా తనిఖీ చేశాక అలాంటిదేమీ జరగలేదన్నారు.
ఇది కూడా చదవండి: Trump: నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు.. రష్యా చమురుపై ట్రంప్ వ్యాఖ్య
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఓ కొలిక్కి వచ్చింది. 90 శాతం పూర్తైంది. ఇంకో 10 శాతం మిగిలి ఉంది. ఇంతలోనే తన ఇంటిపై ఉక్రెయిన్ దాడి చేసిందంటూ రష్యా ఆరోపించింది. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. అంతేకాకుండా శాంతి ఒప్పందంపై సందిగ్ధం పడింది. తాజాగా అలాంటి దాడి ఏమీ జరగలేదని ట్రంప్ తేల్చిచెప్పారు.
#WATCH | On reports of a targeted attack on the Russian President's residence by Ukraine, US Prsident Donald J Trump says, "I don't believe that strike happened… He said that his house was attacked. We don't believe that happened now that we have been able to check… If I… pic.twitter.com/Q8Gq2Hwh5G
— ANI (@ANI) January 5, 2026