రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ ప్రతినిధులు ఇరు దేశాలతో చర్చలు జరుపుతున్నారు. తాజాగా మాస్కోలో పుతిన్‌తో అమెరికా దౌత్యవేత్తలు సమావేశం అయ్యారు.
ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కొలిక్కి వచ్చిందంటూ అంతర్జాతీయంగా కథనాలు వెలువడుతున్నాయి. ఓ వైపు అమెరికా కూడా శాంతి ఒప్పందం దగ్గరలోనే ఉందని చెబుతుండగా.. ఇంకా చర్చలు జరుగుతున్నాయంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం ట్రంప్ 28 పాయింట్ల ప్రణాళిక రచించారు. ఈ ప్రణాళికపై గురువారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో అమెరికా అధికారులు చర్చించారు. వారం రోజుల్లో ప్రణాళికను అంగీకరించాల్సిందేనని అల్టిమేటం విధించారు.
Vladimir Putin: ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం గురించి ఊహాగానాలు, అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆయనకు ప్రాణాంతక క్యాన్సర్ ఉందని పలు నివేదికలు కూడా వెలువడ్డాయి. తాజాగా, మరోసారి పుతిన్ ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆయన కుడి చేతి వాపుగా ఉందని ఈ వీడియో చూపిస్తోందని న్యూస్ వీక్ నివేదించింది. Read Also: True 8K వీడియో…
రెండు వారాల్లో పుతిన్‌ను కలుస్తానని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. గురువారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రెండు వారాల్లో హంగేరీలోని బుడాపెస్ట్‌లో పుతిన్‌ను కలవాలని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌తో పుతిన్ యుద్ధాన్ని ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, లండన్ తొలి ముస్లి్ం మేయర్ సాదిక్ ఖాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూకే పర్యటనలో ఉన్న ట్రంప్, సాదిక్ ఖాన్ ‘‘ప్రపంచంలోనే చెత్త మేయర్లలో ఒకరు’’ అని విమర్శించారు. యూకే రాజధానిలో నేరాలు, వలసల్ని అరికట్టడంతో ఆయన విఫలమయ్యారని అన్నారు. తన గౌరవార్థం యూకే ప్రభుత్వం ఇస్తున్న విందుకు అతడిని ఆహ్వానించవద్దని తానను వ్యక్తిగతంగా కోరినట్లు వెల్లడించారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రత్యేకంగా భేటీ అయి చర్చలు కూడా జరిపారు. అయినా పురోగతి లభించలేదు.
చైనా బుధవారం భారీ సైనిక కవాతు నిర్వహించింది. బీజింగ్ వేదికగా అత్యంత పవర్ఫుల్ క్షిపణులను ప్రయోగించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించిన గుర్తుగా 80వ వార్షికోత్సవాన్ని చైనా నిర్వహించింది.
చైనాలోని బీజింగ్‌లో భారీ ఎత్తున సైనిక కవాతు జరిగింది. బుధవారం పెద్ద అట్టహాసంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, 25 దేశాధినేతలంతా హాజరయ్యారు.