పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ నటించిన ‘చోర్ బజార్’ మూవీ ఈ నెల 24న విడుదల కాబోతోంది. దాంతో ఈ మూవీని సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చారు మాస్ మహరాజా రవితేజ. ఈ చిత్రంలోని ‘బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్’ లిరికల్ సాంగ్ ను ఆయన తాజాగా విడుదల చేశారు. రవితేజ కూడా అమితాబ్ అభిమానే కావడం విశేషం. ఆయన తన సినిమాల్లో అమితాబ్ డైలాగ్స్ చెబుతుంటారు. పూరీ ఫ్యామిలీతో తనకున్న అనుబంధం, అటు తన ఫేవరేట్ స్టార్…