పంజాబ్ డిజిపి ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోటా ను తొలగించాలన్న సిధ్దూ డిమాండ్ కు ముఖ్యమంత్రి చరణజిత్ సింగ్ ఛన్ని సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కొన్నిసార్లు భావావేశానికి లోనౌతారనే విషయం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి తెలిసిందేనని, అర్దం చేసుకుంటుందని వ్యాఖ్యానించారు సిధ్దూ సలహాదారు మహమ్మద్ ముస్తాఫా. రాష్ట్ర మంత్రివర్గం కూర్పులో ముఖ్యమంత్రి ఛన్ని తనను సంప్రదించలేదని, బేఖాతరు చేశారనే ఆగ్రహంతో పాటు, పంజాబ్ డిజిపి, అడ్వకేట్ జనరల్ నియామకాల పట్ల…