Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ గురించి ఒక్కో విషయం బయటపడుతోంది. పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర ఇందులో దాగున్నట్లు తెలుస్తోంది. ఇతనికి పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇతడికి సహాయకుడిగా ఉన్న ఢిల్లీ చెందిన దల్జీత్ కల్సికి పాక్ ఐఎస్ఐతో నేరుగా సంబంధాలు ఉన్నాయి.
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు తెలిపాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడైన అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్ విస్తృతంగా వెతుకుతున్నాయి. పంజాబ్ సరిహద్దులను మూసేసి అతడిని పట్టుకునేందుకు రెండు రోజులు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 78 మంది మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. సున్నిత ప్రాంతాల్లో బలగాలను మోహరించారు.
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ఓ ఆర్మీ అధికారి తన భార్యను హత్య చేసి ఆదివారం రాత్రి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు ముందు కల్నల్ ఓ సూసైడ్ నోట్ కూడా రాశారు.
Husband burned his wife and children alive in punjab: పచ్చని సంసారాన్ని క్షణికావేశం బుగ్గి చేసింది. భార్య, భర్తల మధ్య గొడవ ఐదుగురి మరణాలకు కారణం అయింది. భార్య తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ భర్త వద్దకు తిరిగి రావడానికి నిరాకరించడంతో భర్త ఐదుగురిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పంజాబ్ రాష్ట్రం జలంధర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి భార్యతో పాటు…
సాధారణంగా అందాల పోటీల్లో గెలిచిన వారికి అందాల కిరీటం, బిరుదులు, షీల్డులు, నగదు బహుమతులు ఇస్తుంటారు. కానీ పంజాబ్‌లోని బటిండాలో అందాల పోటీ ప్రకటన చూసి అందరూ అవాక్కయ్యారు.
Siddu Musewala murder case: పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసులో నిందితులకు, పోలీసులు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బుధవారం అమృత్‌సర్ జిల్లాలోని పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు అట్టారీ బార్డర్ కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోషియార్ నగర్ గ్రామంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో సిద్దూ మూసేవాలా హత్యతో ప్రమేయం ఉందని భావిస్తున్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్ జగ్రూప్ సింగ్ రూపం, మన్ ప్రీత్ సింగ్ అలియాస్ మన్నూ కుస్సాను…
దేశంలో సంచలనం సృష్టించిన ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి మాన్సా కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీని విధించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను బుధవారం తెల్లవారుజామున పోలీసులు మాన్సా కోర్టుకు తరలించారు. అతనికి మొదట వైద్య పరీక్షలు నిర్వహించి స్థానిక కోర్టులో హాజరుపరచగా.. అతనికి 7 రోజుల పోలీసు కస్టడీ విధించింది. పోలీసులు 10 రోజుల పోలీసు కస్టడీ కోరగా..…