ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 214 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే పూర్తి చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ షేక్ ఆడించాడు. 28 బంతుల్లో 66 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత.. క్లాసెన్ (42) పరుగులు చేశాడు. ఆ తర్వాత నితీష్ కుమార్…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రెండు మ్యాచ్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు సాధించారు. పంజాబ్ బ్యాటింగ్లో అత్యధికంగా ప్రభ్సిమ్రాన్ సింగ్ (71) పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 4 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత అథ్వారా థైడే (46),…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 69వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మే 19 న మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఇక ఇరుజట్లు సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు 22 మ్యాచ్లు ఆడాయి. ఎస్ఆర్హెచ్ 15 విజయాలతో ఆధిపత్యం చెలాయించగా, పిబికెఎస్ 7 మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది. Hyderabad…
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. ఇంకా 7 బంతులు మిగిలి ఉండాగానే ముగించేసింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. పంజాబ్ బౌలర్ల ధాటికి ఆర్ఆర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. చివరి వరకు పోరాడిన రియాన్ పరాగ్ (48) ఒక్కడే అత్యధికంగా స్కోరు చేశాడు. ఈ క్రమంలో.. రాజస్థాన్ ఈ మాత్రం స్కోరు చేసింది. మిగత బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఓపెనర్ జోష్ బట్లర్ లేని వెలితి కనిపిస్తోంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆర్ఆర్.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
Sam Curran apologize to fans after Punjab Kings eliminated from IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్ నిష్క్రమించడం చాలా బాధగా ఉందని ఆ జట్టు కెప్టెన్ సామ్ కరన్ తెలిపాడు. అభిమానులు తమని క్షమించాలని, మిగతా మ్యాచ్‌లలో తాము పోరాడుతామన్నాడు. ఈ సీజన్ అంతటా చాలా సానుకూల అంశాలు ఉన్నాయని, దురదృష్టవశాత్తు కొన్ని మ్యాచ్‌లలో ఓటమి చెందాల్సి వచ్చిందన్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టును నడిపించడం…
ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. 60 పరుగుల తేడాతో బెంగళూరు గెలుపొందింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. 16 ఓవర్లలో 181 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలవడంపై ఇంకా ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పంజాబ్ బ్యాటింగ్ లో రిలీ రోసో అత్యధికంగా 61 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ధర్మశాల వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024)లో నేడు (గురువారం) పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు జరగనుంది.