IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024)లో నేడు (గురువారం) పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు జరగనుంది. కాగా, హ్యాట్రిక్ విజయాలు సాధిస్తూ.. ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే ఆర్సీబీ జట్టు ఆశలు సజీవంగా ఉన్నాయి. ఇక, మరోవైపు, గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ 28 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక, ఈ మ్యాచ్ లో గెలిచేందుకు పంజాబ్ పక్కా ప్లాన్ తో బరిలోకి దిగుతుంది.
Read Also: Samsung Galaxy F55 5G : శాంసంగ్ నుంచి అదిరిపోయే ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే?
కాగా, ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మొత్తం 32 సార్లు తలపడ్డాయి. ఇందులో 15 మ్యాచ్‌ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపొందగా, పంజాబ్ 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. గత మూడు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ వరుస విజయాలను నమోదు చేయగా.. ఈ సీజన్‌లో పంజాబ్ ఆడిన 11 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలవగా, ఆ జట్టు 7 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక, ఇవాళ గెలిచిన జట్టు ప్లేఆఫ్ అవకాశలు మెరుగ్గా ఉంటాయి.. ఓడిపోయిన టీమ్ దాదాపు ఈ మెగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించినట్లే అని చెప్పొచ్చు..