హర్షల్ పటేల్ బౌలింగ్ లో మహేంద్ర సింగ్ ధోని గోల్డెన్ డక్ గా పెవిలియన్ బాట పట్టడంతో స్టాండ్స్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా మాత్రం తన సంతోషాన్ని ఆపుకోలేకపోయింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టును.. 139 పరుగులకే కట్టడి చేసింది. చెన్నై బౌలర్లు అద్భుతంగా రాణించడంతో పంజాబ్ బ్యాటర్లు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. పంజాబ్ బ్యాటింగ్ లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఒక్కడే అత్యధికంగా (30) పరుగులు చేశాడు. ఆ తర్వాత బెయిర్ స్టో (7), రోసో డకౌట్ అయ్యాడు. శశాంక్ సింగ్ (27),…
ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. ఓ మోస్తరు స్కోరు చేసింది. పంజాబ్ ముందు ఫైటింగ్ స్కోరును ఉంచింది. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సిక్సర్ల దూబె మళ్లీ విఫలమయ్యాడు. ఏమీ పరుగులు చేయకుండా డకౌట్ అయ్యాడు. ధోనీ కూడా ఒక్క రన్ చేయకుండానే ఔటయ్యాడు.
ఐపీఎల్ 17 వ సీజన్ లో భాగంగా ఆదివారం 53వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇకపోతే గత మూడేళ్ల నుండి పంజాబ్‌పై విజయం కోసం చెన్నై జట్టు ఎదురుచూస్తోంది. వీరిద్దరి మధ్య జరిగిన గత 5 మ్యాచ్‌ల్లో పంజాబ్ 4 మ్యాచులు విజయం సాధించగా, చెన్నై కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుత సీజన్ లో…
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించింది. 17.5 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి చేధించింది. పంజాబ్ బ్యాటింగ్లో బెయిర్ స్టో (46), రిలీ రోస్సో (43) పరుగులతో రాణించారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ (13), శశాంక్ సింగ్ (25*), సామ్ కరన్ (26*)
ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైటింగ్ స్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (62) పరుగులతో రాణించడంతో సీఎస్కే.. ఓ మోస్తరు స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. పంజాబ్ ముందు 163 పరుగుల ఫైటింగ్ టార్గెట్ను ఉంచింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ సంచలనం సృష్టించింది. 262 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే చేధించి రికార్డు సృష్టించింది. 262 పరుగుల టార్గెట్ ను పంజాబ్ బ్యాటర్లు చితక్కొట్టారు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి కోల్కతా బౌలర్లకు తమ హోంగ్రౌండ్ లో చుక్కలు చూపించారు. బ్యాటింగ్ కు వచ్చినోళ్లు వచ్చినోళ్లు సిక్సర్ల వర్షం కురిపించారు. 262 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ (54)…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్కతా నైట్రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. మొదట టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.