Dera Sacha Sauda: 2015 నాటి మూడు ఇంటర్‌లింక్డ్ బర్గారీ సాక్రిలేజ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌పై విచారణపై పంజాబ్ – హర్యానా హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు శుక్రవారం ఎత్తివేసింది. బర్గారీలో గురుగ్రంథ సాహిబ్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణలపై గుర్మీత్ రామ్ రహీమ్‌పై జరుగుతున్న మూడు కేసుల్లో విచారణను మార్చిలో పంజాబ్ హర్యానా హైకోర్టు నిలిపివేసింది. ఈ ఉత్తర్వులను పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు…
సహజీవనంపై హర్యానా, పంజాబ్ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సహజీవనం నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాదని పేర్కొంది హై కోర్టు. ఇంటి నుంచి పారిపోయిన ఓ జంట తమకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా హై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషినర్లు గుల్జా కుమారి (19), గురువిందర్ (22) తార్న్ తరన్ జిల్లాకు చెందిన వారు. ఈ క్రమంలో వారు తాము కలిసి నివాసిస్తున్నామని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని పేర్కొన్నారు.…