Kangana Ranaut: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి భాజపా ఎంపీగా ఉన్న ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు పంజాబ్-హర్యానా హైకోర్టులో ఓ కేసులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెపై ఉన్న డిఫమేషన్ కేసును రద్దు చేయాలంటూ ఆమె వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసు 2021లో జరిగిన సంఘటనలకు సంబంధించింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా కిసాన్ ఆందోళన జరుగుతుంది. అదే సమయంలో కంగనా రనౌత్ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో బతిండా జిల్లా బహదూర్‌గఢ్…
Supreme Court: వైవాహిక వివాద కేసులో జీవిత భాగస్వామి టెలిఫోన్ సంభాషణల్ని రహస్యంగా రికార్డ్ చేయడం ఆమోదయోగ్యమైన సాక్ష్యమని సుప్రీంకోర్టు సోమవారం ఓ కేసులో తీర్పు చెప్పింది. జీవిత భాగస్వామి టెలిఫోన్ సంభాషణల్ని రహస్యంగా రికార్డు చేయడం గోప్యత హక్కును ఉల్లంఘిస్తుందని, కుటుంబ కోర్టులో సాక్ష్యంగా అంగీకరించలేమని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పున సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.
సుప్రీంకోర్టుపై పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు బుధవారం తొలగించింది. ఈ వ్యాఖ్య అవమానకరమని, అనవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది.
డేరా సచ్చా సౌదా అధినేత గుర్మింత్ రామ్ రహీమ్ సింగ్ కు పంజాబ్-హర్యానా హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింద. రంజిత్ సింగ్ హత్య కేసులో అతడ్ని నిర్దోషిగా ప్రకటించింది.
రైతుల ఉద్యమం కారణంగా రహదారులను మూసివేయడంపై పంజాబ్- హర్యానా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పీఐఎల్‌పై విచారణ సందర్భంగా.. రైతులు జాతీయ రహదారిపై ఆందోళన చేసే హక్కు ఉంది అని హర్యానా ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.
Farmers Protest: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)తో పాటు రైతుల సమస్యల పరిష్కారానికి పలు డిమాండ్లు చేస్తూ రైతులు "ఢిల్లీ ఛలో" మార్చ్‌కి పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులను అడ్డుకునేందుకు బారికేడ్లు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు కేంద్ర బలగాలు రైతుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో పంజాబ్-హర్యానా హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు విచారించింది.
ఇక ముందు గ్రామసింహాలు (ఊర కుక్కలు), ఇతర మూగ జీవుల దాడిలో ఎవరైనా గాయాడితే.. గాయపడిన వాళ్ళకి నష్ట పరిహారం చెల్లించాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది.