పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) గురువారం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ‘ఆప్’ జాతీయ పార్టీ హోదాను పొందే అవకాశాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. “ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించినందుకు…
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది ఆమ్‌ఆద్మీ పార్టీ.. ఆప్ దూకుడు ముందు సీఎం, మాజీ సీఎంలు, రాజకీయ దిగ్గజాలు సైతం తోకముడవాల్సి వచ్చింది.. సీఎం చన్నీ, డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ బాదల్, ఏకంగా ఐదుసార్లు సీఎంగా సేవలు అందించిన ప్రకాష్ సింగ్ బాదల్, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు కూడా ఓటమి తప్పలేదు. అయితే, సిట్టింగ్ సీఎం చన్నీ పోటీ…
ఈసారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీ తరఫున మోగా నియోజకవర్గం నుండి పోటీ చేసింది. నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకూ తన జీవితాన్ని అంకితం చేసిన సోనూసూద్ ను దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ రాజకీయ అరంగేట్రమ్ చేస్తాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు కానీ తన సోదరిని రంగంలోకి దించారు.…
అసెంబ్లీ ఎన్నికల సమయంలో పంజాబ్‌లో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది… ఓవైపు పాలక కాంగ్రెస్.. మరోవైపు ఆప్, ఇంకో వైపు అమరీందర్‌సింగ్, బీజేపీ.. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారి ఉన్నారు.. ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్‌యుద్ధం మాత్రం ముగియడంలేదు.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తానే సీఎం అభ్యర్థిని అంటూ ప్రచారం చేసుకున్న పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ భంగపాటు తప్పకపోగా.. సిట్టింగ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకే మరోసారి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్…