Ramleela play: రామయాణం ఇతిహాసం ఆధారంగా నాటకాన్ని ప్రదర్శిస్తూ.. అందులో పవిత్ర దేవీదేవతలను కించపరుస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు పూణే యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్, ఐదుగురు విద్యార్థులను శనివారం అరెస్ట్ చేశారు. నాటకంలో అసభ్యకరమైన సీన్లు, డైలాగ్స్ ఉన్నాయని, ఇందులో సీతాదేవీ పాత్రధారి సిగరేట్ తాగుతున్నట్లు చూపించారని ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీ కార్యకర్త హర్షవర్థన్ హర్పుడే ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295 (A) మరియు ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం…