Andhra Pradesh: వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన బస్ టెర్మినల్‌ను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. మూడు రోజుల పర్యటన కోసం వైఎస్ఆర్ కడప జిల్లాకు విచ్చేసిన సీఎం జగన్ శనివారం నాడు పులివెందులలో నూతనంగా నిర్మించిన బస్ టెర్మినల్ ను ప్రారంభించారు. అనంతరం బస్ టెర్మినల్ ను సీఎం జగన్ స్వయంగా పరిశీలించి, ఆర్టీసీ కార్యాలయం, కాంప్లెక్స్ నిర్మాణ శైలిని ప్రయాణికుల సదుపాయాలను పరిశీలించారు. ప్రారంభోత్సవానికి ముందు సీఎం జగన్…
CM Jagan: కడప జిల్లా పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. గ్లాస్‌లో 75 శాతం నీళ్లు ఉన్నా నీళ్లు లేవని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకు ఓటు వేయని వారికి కూడా మంచి చేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. గతంలో ఇదే రాష్ట్రమని.. ఇదే బడ్జెట్…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వరుసగా రాష్ట్రాన్ని చుట్టూస్తున్నారు.. జిల్లాల్లో పర్యటిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, శంకుస్థాపనలను చేయడంపై దృష్టిసారించారు.. ఇక, సొంత జిల్లాలో మరోసారి పర్యటించానున్నారు ఏపీ సీఎం.. తన పర్యటనలో ప్రొద్దుటూరులో డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి మనవడి వివాహానికి హాజరుకాబోతున్నారు.. అనంతరం పులివెందులలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. Read Also: Minister Kakani: బాబుకు సవాల్.. దమ్ముంటే రైతుల…
పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండల వైసీపీ ఇంఛార్జి కొండారెడ్డిని సోమవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందుల-రాయచోటి రోడ్డు పనులు చేస్తున్న ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ సంస్థ కాంట్రాక్టర్‌ను బెదిరించిన కేసులో కొండారెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పులివెందుల-రాయచోటి మధ్య రోడ్డు పనులను కొండారెడ్డి అడ్డుకున్నారని.. చక్రాయపేట మండలంలో పనులు జరగాలంటే తనకు డబ్బులివ్వాలని బెదిరించారని కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సదరు కన్‌స్ట్రక్షన్ సంస్థ కర్ణాటకలోని ఓ బీజేపీ…
ఏపీలో కొత్త జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా కడప, కోనసీమ జిల్లాల్లో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం, అమలాపురం డివిజన్లలోని 7 మండలాలను కొత్తపేట రెవెన్యూ డివిజన్ గా ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. కొత్తపేట రెవెన్యూ డివిజనులో ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలను చేరుస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది రెవెన్యూ శాఖ. కడప జిల్లాలో కొత్త…
కడప జిల్లాలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం నాడు పులివెందుల ఇండస్ట్రియల్ పార్కులో రూ.110 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పులివెందులలో ఆదిత్యా బిర్లా పెట్టుబడులను చారిత్రాత్మక ఘటనగా సీఎం జగన్ అభివర్ణించారు. పులివెందులకు మంచి కంపెనీ రావడం తనకు సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారా సుమారు 2వేల ఉద్యోగాలు లభిస్తాయని…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.. ఈ కేసులో తాజాగా మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది సీబీఐ.. హైదరాబాద్‌లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు… ఈ కేసులో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే కాగా.. వివేకాను హత్య చేస్తే 40 కోట్లు ఇస్తారంటూ వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పాడని దస్తగిరి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు.. అయితే,…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ రాయలసీమలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో సీఎం పర్యటన ఉంటుంది. జూలై 8న ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు. పది గంటల ప్రాంతంలో పుట్టపర్తిలో విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా రాయదుర్గం చేరుకుని ఉదేగోలం గ్రామంలో రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. వైఎస్సార్ ఆర్బీకే ప్రారంభించటంతో పాటు వ్యవసాయ అధికారులు, సిబ్బందితో ఇంటరాక్ట్ అవుతారు.…