పులివెందులలో సీఎం జగన్ తరఫున ఆయన సతీమణి వైఎస్ భారతి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాలకు వెళ్లి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. గడపగడపకు వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. వైసీపీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వైఎస్ భారతి వివరిస్తున్నారు.
నా ఇద్దరు చెల్లెమ్మలతో కుట్రలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు.. మా వివేకం చిన్నానను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో, ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు సీఎం జగన్.. మా ఇద్దరి చెల్లెమ్మలను ఎవరు పంపించారో ప్రజలందరికీ తెలుసు.. వివేకం చిన్నానను అతి దారుణంగా చంపి బహిరంగంగా తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు..? అని ప్రశ్నించారు సీఎం జగన్
తన సొంత నియోజకవర్గం పులివెందులలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్.. పులివెందుల సిద్ధమేనా...? అంటూ ప్రశ్నించిన ఆయన.. నా ప్రాణానికి ప్రాణమైన నా సొంత గడ్డ పులివెందుల.. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీగా అభివర్ణించారు.
మేమంతా సిద్ధం బస్సు యాత్రతో రాష్ట్రాన్ని చుట్టే.. బుధవారం రోజు బస్సు యాత్రను ముగించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్నారు.
రేపు పులివెందులలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదట సిద్ధం సభలు, ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపట్టిన వైసీపీలో ఫుల్‌జోష్ కనపడుతోంది. ఈ జోష్‌లోనే నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఎలాగైనా అధికారంలో రావాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం అనే నినాదంతో దూసుకెళ్తున్నాడు. ఈ సమయంలో ఆయన భార్య కూడా సిద్ధం అంటూ ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. ఇకపోతే ఏప్రిల్ 18న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 25న పులివెందుల సీఎం జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతున్నాడు. ఇందుకు గాను పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం బాధ్యతలను జగన్…
ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో భాగంగా ఇప్పటికే అన్ని పార్టీలు వారి అభ్యర్థులను ప్రకటించారు. దీంతో వారందరూ వారి నియోజకవర్గాలలో తిరుగుతూ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు డేట్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 25న సీఎం జగన్ పులివెందుల నామినేషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 24వ తేదీన శ్రీకాకుళంలో జరిగే ‘ మేమంతా సిద్ధం’…