పాండిచ్చేరి క్రికెట్ అసోసియేషన్ (సీఏపీ) అండర్-19 హెడ్ కోచ్ ఎస్.వెంకటరామన్‌పై దాడి జరిగింది. సోమవారం ముగ్గురు స్థానిక క్రికెటర్లు కోచ్‌పై దాడి చేశారు. దాడిలో కోచ్ వెంకటరామన్ తలకు గాయం కాగా.. భుజం విరిగిందని సేదరపేట పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఎస్.రాజేష్ ధ్రువీకరించారు. వెంకటరామన్ నుదిటిపై 20 కుట్లు పడ్డాయని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న జాతీయ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ నుంచి ఆటగాళ్లను తొలగించడమే ఈ…
పుదుచ్చేరి కేంద్రంగా టీవీకే అధినేత, నటుడు విజయ్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట తర్వాత తొలిసారి పబ్లిక్ మీటింగ్‌లోకి వస్తున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కరూర్ తొక్కిసలాట తర్వాత టీవీకే అధినేత విజయ్ తొలిసారి పబ్లిక్‌లోకి వస్తున్నారు. మంగళవారం రోడ్‌షో, బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈసారి తమిళనాడు కాకుండా వేదిక పుదుచ్చేరికి మారింది.
TVK Party: నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. పుదుచ్చేరిలో మంగళవారం (డిసెంబర్ 9న) నిర్వహించనున్న రాజకీయ సభకు ఆంక్షలు విధించారు.
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో కొనసాగుతున్న ‘దిత్వా’ తుపాను తమిళనాడుపై పంజా విసురుతోంది. తమిళనాడులో శనివారం అర్దరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, రామనాథపురం,తంజావూరు, తిరువారూరు, కోయంబత్తూరులో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 62కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. చెన్నై-శ్రీలంక విమాన సర్వీలు రద్దయ్యాయి. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరంలో దిత్వా తుఫాన్ కొనసాగుతోంది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా…
Cyclone Ditwah: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ భారత్ వైపు కదులుతోంది. దిట్వా తుఫాను ముంచుకొస్తుండటంతో తమిళనాడు హై అలర్ట్ అయింది. తుఫాన్ శ్రీలంక తీరప్రాంతం మీదుగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానిని అనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వాయువ్య దిశగా కదులుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తుఫానుకు యెమెన్ దేశం దిట్వా తుఫానుగా పేరు పెట్టింది. Read Also: Anjali Sharma: ఆఫ్రికన్ జాతీయుడిని వివాహం చేసుకున్న హిమాచల్ పర్వతారోహకురాలు.. మొదటగా ఎక్కడ…
ప్రముఖ మోడల్ శాన్ రీచల్ ఆత్మహత్య చేసుకుంది. పుదుచ్చేరిలో తన తండ్రి ఇంట్లో అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ప్రాణాలు తీసుకుంది. అధిక ఒత్తిడి కారణంగా తనకు తానుగా మరణశాసనాన్ని రాసుకుంది.
తమిళనాడులో మంగళవారం ఉదయం రైలు ప్రమాదం తప్పింది. పుదుచ్చేరికి వెళ్తున్న మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (MEMU) రైలు కోచ్‌లు పట్టాలు తప్పాయి. విల్లుపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారి తెలిపారు. లోకో పైలట్ దానిని చూసి వెంటనే రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మూడు గంటల్లోనే రైలు రాకపోకలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. పట్టాలు తప్పడానికి గల కారణాలు విచారణ పూర్తయిన తర్వాతే తెలుస్తుందని చెప్పారు.…
తమిళనాడులో రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ ఘోర విషాదం నింపింది. భారీ వర్షాల ధాటికి 18 మంది మృతి చెందారు. తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షాలకు తిరువన్నమలైలో కొండ చరియలు విరిగిపడ్డాయి పలు ఇళ్లపై.. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు.