కరూర్ తొక్కిసలాట తర్వాత టీవీకే అధినేత విజయ్ తొలిసారి పబ్లిక్‌లోకి వస్తున్నారు. మంగళవారం రోడ్‌షో, బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈసారి తమిళనాడు కాకుండా వేదిక పుదుచ్చేరికి మారింది. పుదుచ్చేరి వేదికగా విజయ్ రాజకీయ బహిరంగ సభలో పాల్గొననున్నారు. తొలుత ఇరుకైన వీధులు, ఇరుకైన దారులు ఉన్నాయంటూ రోడ్‌షోకు పుదుచ్చేరి పోలీసులు అనుమతి నిరాకరించారు. మొత్తానికి కఠినమైన షరతులతో విజయ్ రోడ్‌షోకు అనుమతి ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. 7.6 తీవ్రత.. సునామీ హెచ్చరిక జారీ
సెప్టెంబర్‌లో తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోయారు. పదుల కొద్ది గాయపడ్డారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతరం మృతుల కుటుంబాలకు విజయ్ ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత విజయ్ మళ్లీ పబ్లిక్‌లోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా మీడియా కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది.
కఠిన షరతులు..
ఇక పుదుచ్చేరి రోడ్‌షోకు విజయ్‌కు కఠినమైన షరతులు విధించారు. కేవలం 5,000 మందికే అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా టీవీకే జారీ చేసిన క్యూఆర్ కోడ్ ఉన్న కార్లకే ప్రవేశం కల్పించనున్నారు. ఇక తమిళనాడు నుంచి ఎవరు వచ్చినా రోడ్‌షోకు అనుమతించరు. ఇక 500 మందికి ఒక ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేయాలని సూచించారు. తాగునీరు, మరుగుదొడ్లు, అంబులెన్స్‌లు, ఇతర భద్రతా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. ఇక విజయ్ ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రసంగించే అవకాశం ఉంది. పోలీసులు ఆదేశించిన ప్రకారం బహిరంగ సభ మధ్యాహ్నం 12:30 గంటలలోపు ముగించాలి. ఇక రోడ్‌షోలో భద్రతాగా 800 పోలీసులు మోహరించనున్నారు. ఇదిలా ఉంటే గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధులు భద్రతా కారణాల దృష్ట్యా హాజరుకావద్దని పార్టీ ఒక సలహాలో కోరింది. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు భవనాలు, పైకప్పులు, చెట్లపైకి లేదా ట్రాన్స్‌ఫార్మర్‌లను ఎక్కడానికి దూరంగా ఉండాలని కోరింది.
ఇది కూడా చదవండి: Sumalatha Johnny Master: తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య సుమలత ఘన విజయం..!
విజయ్.. తమిళనాడుతో పాటు కేరళ, పుదుచ్చేరిలో కూడా మద్దతు కూడా బెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు పుదుచ్చేరిలో పార్టీ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక పుదుచ్చేరి రోడ్‌షో అయిపోయిన తర్వాత ఈనెలాఖరు నుంచి తమిళనాడు వ్యాప్తంగా విజయ్ పర్యటనలు చేపట్టనున్నారు.