SpaDeX Docking Update: అంతరిక్షంలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను కనబరుస్తున్నాయి. తాజాగా స్పేడెక్స్ ఉపగ్రహాలు అత్యంత సమీపానికి చేరుకున్నాయని ఇస్రో ప్రకటించింది. ఈ విషయాన్ని తాజాగా ఇస్రో ఎక్స్‌లో పోస్టు చేయడం ద్వారా వెల్లడించింది. ఈ ఉపగ్రహాలను 15 మీటర్ల దూరం వరకు తీసుకువచ్చి, ఆ తర్వాత ఆ దూరాన్ని కేవలం 3 మీటర్లకు తగ్గించినట్లు తెలిపింది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం, రెండు…