ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పంజాబ్ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కారణం అని చెప్పవచ్చు. కాగా, ఇప్పుడు ఆయన 2024లో కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక వచ్చే ఏడాది యూపీకి ఎన్నికలు జరగబోతున్నాయి. యూపీలో కాంగ్రెస్ తోపాటుగా సమాజ్ వాదీ పార్టీ కూడా పుంజుకుంటోంది. వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా కాకుండా పోటాపోటీగా జరిగే అవకాశం ఉన్నది. ఇక ఇదిలా ఉంటే,…
కొద్ది రోజుల నుంచి ఉత్తర ప్రదేశ్లో మార్మోగుతున్న పేరు..ప్రియాంకా గాంధీ. హింసాకాండ జరిగిన లఖింపూర్ వెళుతుండగా మార్గ మధ్యలో సీతాపూర్ వద్ద యూపీ పోలీసులు ఆమెను ఆదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆమెను ఉంచిన గెస్ట్ హౌస్ గదిని చీపురు పట్టి ఆమే శుభ్రం చేసుకున్నారు. అదే సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తరువాత సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి లఖింపూర్ వెళ్లారు. శుక్రవారం స్థానిక వాల్మీకి కాలనీలో మళ్లీ చీపురుతో కనిపించారు. ఈసారి ఆమె రోడ్డు…
కాంగ్రెస్లో మళ్లీ కలకలం.. హస్తం పార్టీలో అలజడి కొత్త కాదు. కానీ, కొద్ది రోజుల క్రితం కపిల్ సిబల్ చేసిన విమర్శలు కాకరేపుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు ఎవరంటూ ఆయన ప్రశ్నించటమే తాజా సంక్షోభానికి కారణం. నాయకత్వాన్ని ప్రశ్నించటం కార్యకర్తలకు నచ్చలేదు. సిబల్ ఇంటి మీద పడ్డారు. గొడవ గొడవ చేశారు. ఇదంతా కావాలనే చేయించారని సిబాల్ బృందం అంటోంది. దాంతో వారు నాయకత్వంతో తాడో పేడో తేల్చుకుంటారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్లో చోటుచేసుకున్న పరిణామాల పట్ల…
కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో పాటు, మరో ముగ్గురు లఖింపూర్ ఖేరీని సందర్శించడానికి యూపీ పోలీసులు అనుమతి ఇచ్చారు. మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇతర ప్రతిపక్ష నాయకులను అనుమతించారు పోలీసులు. లఖింపూర్ ఖేరీ వెళ్లేందుకు అనుమతి ని నిరాకరిస్తూ ప్రియాంక గాంధీ ని సోమవారం అరెస్టు చేసారు పోలీసులు. ఈరోజు ఉదయం, రాహుల్ గాంధీ, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ , పంజాబ్…
రాజకీయంగా దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. వచ్చే ఏడాది ఇక్కడ ఎన్నికలు జరగున్నాయి. దశాబ్దాల పాటు యూపీని పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు అక్కడ నామ మాత్రంగా మిగిలిపోయింది. కానీ గాంధీ-నెహ్రూ కుటుంబం అంటే ఇప్పటికీ యూపీ ప్రజలలోఎంతో కొంత గౌరవం..పలుకుబడి మిగిలే వుంది. అయితే కులాల వారిగా ఓట్లు చీలిపోవటంతో హస్తం పార్టీకి అవకాశం లేకుండా పోతోంది. మూడు దశాబ్దాల నుంచి అంతకంతకు పడిపోతున్న పార్టీ ప్రతిష్టను పెంచే బాధ్యతను ప్రియాంక గాంధీ తీసుకున్నారు. ఇప్పుడు…
ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ వారం రోజులపాటు పర్యటించబోతున్నారు. సోమవారం నుంచి అమె వారం పాటు పర్యటనకు సంబందించిన షెడ్యూల్ను ఖరారుచేశారు. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్కు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ప్రియాంకగాంధీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఉత్తర ప్రదేశ్లోని కీలక నేతలతో ప్రియాంక గాంధీ వరసభేటీలు జరపబోతున్నారు. కీలక నేతలతో ఆమె మంతనాలు జరపనున్నారు. 2022 లో ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రియాంక గాంధీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకారు, కాంగ్రెస్…
వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావోరేవో అన్నట్లుగా మారాయి. వరుసగా రెండుసార్లు కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోవడంతో ఆపార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ లోని కీలక నేతలంతా ఎవరి దారి వారు చూసుకోవడంతో ఆపార్టీ నడిపించాల్సి బాధ్యత ‘గాంధీ’ కుటుంబంపైనే పడింది. దీంతో ఆ కుటుంబంలోని ప్రతీఒక్కరు వచ్చే ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకొని బరిలో దిగుతున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలకు ముందు వస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్…
కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో.. యూపీ రాజకీయాలు వేడెక్కాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పట్నుంచే సన్నద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఈసారి ప్రియాంకగాంధీ నాయకత్వంలో.. ఎలక్షన్స్ వెళ్లాలని నిర్ణయించింది. ఆమెనే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయనీ.. సల్మాన్ ఖుర్షీద్…
వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్నిపార్టీలు సమాయాత్తం అవుతున్నాయి. అమ్ములపొదిలోని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. యోగీ నేతృత్వంలోనే 2022 ఎన్నికలకు సిద్ధమవుతుండగా, కాంగ్రెస్ పార్టీ కొత్త తరం నేతలతో దూకుడు పెంచేందుకు సిద్ధం అవుతున్నది. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయని ప్రియాంకా గాంధీ మొదటిసారి యూపి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఆమెను యూపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్టు…
గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత రెండు పర్యాయాలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ ప్రభావం క్రమంగా అన్ని రాష్ట్రాలపై పడింది. దీంతో కాంగ్రెస్ క్రమంగా ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తుంది. ఇదే సమయంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావోరేవో అన్నట్లుగా మారింది. దీంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ సైతం ఛాలెంజ్ తీసుకుని పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు…