కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 మంది సీనియర్ నేతలతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్‌ను చైర్మన్‌గా నియమించారు. జాతీయ స్థాయిలో పోరాటాలకు ప్రణాళికలను రూపోందించే ఈ కమిటీలో ప్రియాంక గాంధీ, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మనీశ్ ఛత్రత్, బీకే హరిప్రసాద్, రిపున్ బోరా, ఉదిత్ రాజ్, రాగిణి నాయక్, జుబిర్ ఖాన్ లు సభ్యులుగా ఉండబోతున్నారు. దేశంలోని…
వచ్చే ఏడాది యూపీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ, యూపీలో ఎలాగైనా గెలిచి తిరిగి పట్టు సాధించాలని చూస్తున్నది. యోగి సర్కార్ వైఫల్యాలు, కరోనా సమయంలో సర్కార్ చేసిన తప్పులు, ప్రజలు పడిన ఇబ్బందులు అన్నింటిని ప్రచారాస్త్రాలుగా వాడుకోవాలని చూస్తున్నది. యూపీ కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ యాక్టీవ్ గా ఉండటంతో ఆమెపై రాష్ట్రనాయకత్వం బోలెడన్ని ఆశలు పెట్టుకున్నది.…
వ్యాక్సిన్ల కొరత అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ తీవ్రంగా తప్పుపట్టింది. వ్యాక్సిన్ సమస్య ఉత్పన్నం కావడానికి మోదీయే కారణమన్నారు. మోదీ సర్కార్ గత ఏడాదే వ్యాక్సినేషన్ ప్లాన్ వేసిందని, కానీ ఈ ఏడాది జనవరిలో కేవలం కోటి 60 లక్షల టీకాలకు మాత్రమే ఎందుకు ఆర్డర్ చేశారని ఆమె ప్రశ్నించారు. దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం తక్కువ సంఖ్యలో టీకాలు కేటాయించిందని, కానీ ఎక్కువ సంఖ్యలో విదేశాలకు టీకాలు అమ్మినట్లు ప్రియాంకా ఆరోపించారు.…