Seethakka: బీజేపీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై తప్పుడు ప్రచారం కాంగ్రెస్ నేతలు ఏడీజీకి వినతిపత్రం అందించారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో ఏడీజీ సంజయ్ కుమార్ జైన్‌ను కలిసి కాంగ్రెస్ నేతలు వినతి పత్రం ఇచ్చారు. బీజేపీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. టూ జీ స్కామ్ , కోల్డ్ స్కామ్‌లో తప్పు చేయలేదని విచారణ సంస్థలే ప్రకటించాయన్నారు. తప్పు జరగలేదని విచారణ సంస్థలు చెప్పినా భారీ కుంభకోణాలు జరిగాయని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలపై కేసులు పెట్టాలని ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు.
అసత్య పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. సైనికుల త్యాగాలను తమ త్యాగాలుగా చెప్పుకొని బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిందని ఆమె ఆరోపించారు. రామున్ని కూడా రాజకీయాల్లో లాగిన దుర్మార్గపు పార్టీ బీజేపీ అని ఆమె మండిపడ్డారు. బీజేపీ నేతలకు నీతి, జాతి ఉంటే ఆదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని సీతక్క డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా పనిచేశారా?.. ప్రియాంక గాంధీ ప్రభుత్వంలో పని చేశారా? .. వారిపై ఇలా ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. దేశ సంపద దోచుకోవడానికి బీజేపీ అదానీని అడ్డం పెట్టుకుందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ నోరు నొక్కాలని బీజేపీ తప్పుడు ఆలోచనలు చేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఇమేజ్‌ని దెబ్బతీయాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. ప్రధాని మోడీ ఒక సూటు కోసమే కోట్లు ఖర్చు చేస్తున్నారని.. మోడీ జీవితం.. రాహుల్ గాంధీ జీవితాన్ని జనం ముందు పెడదాం రండి అంటూ సవాల్ విసిరారు.
Read Also: Minister Ktr: ఇల్లు చల్లగా ఉండేలా కూల్ రూఫ్.. ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
బీజేపీ అధికారంలోకి వచ్చాక పౌరుల హక్కులను, పార్లమెంటు సభ్యుల హక్కులను కూడా కాలరాస్తోందన్నారు. కేసీఆర్‌కు దేశానికి ఎన్నికల ఖర్చులు ఇచ్చే డబ్బులు ఎలా వచ్చాయో తేలాలని సీతక్క డిమాండ్ చేశారు. కేసీఆర్ తొమ్మిదేళ్ల పరిపాలన పైన విచారణ జరపాలన్నారు.