కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ అక్టోబర్ 23న (బుధవారం) వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నవంబర్ 13న లోక్‌సభ ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్.. ప్రియాంక పేరును అధికారికంగా ప్రకటించింది. ప్రియాంక వెంట ఆమె భర్త రాబర్ట్ వాద్రా, సోదరుడు రాహుల్ గాంధీ ఉండనున్నారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంకాగాంధీ కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు. గురువారం ఇద్దరు కలిసి ప్రకృతి విలయం సృష్టించిన చూరల్‌మలలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో కలియ తిరిగారు.
ఇటీవల కాలంలో నిరుద్యోగుల ఉద్యోగాల కోసం పోటెత్తున్నారు. నోటిఫికేషన్లు వెలువడగానే జాబ్స్ కోసం ఎగబడుతున్నారు. ఆ మధ్య గుజరాత్‌లో హోటల్ ఉద్యోగం కోసం యువత ఎగబడింది.
ప్రియాంకాగాంధీ.. పరిచయం లేని పేరు. రాజీవ్-సోనియాల కుమార్తెగా.. రాహుల్ గాంధీ సోదరిగా.. రాబర్ట్ వాద్రా భార్యగా ప్రియాంక అందరికీ తెలిసిన ముఖమే. అయితే ఆమె ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత ఓటింగ్ శుక్రవారమే జరగనుంది. ఇందుకోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈనెల 16న అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు ‘ఎక్స్’ ట్విట్టర్ ద్వారా ఆమె తెలియజేశారు.
Congress: కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో మెగా ర్యాలీ జరగనుంది. డిసెంబర్ 28న జరిగే ఈ మెగా ర్యాలీకి 10 లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు హాజరుకానున్నారు.
కర్ణాటక పాల సమాఖ్య నేతృత్వంలోని నందిని పాలను గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ పాలలో విలీనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎన్నికల వేళ మాటల యుద్దం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీలోని లుటియన్స్లో ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఖాళీ చేశారు. ఆయన తన తల్లి సోనియా గాంధీతో కలిసి జన్పథ్లోని నివాసంలో కొంతకాలం ఉంటారు. రాహుల్ గాంధీ ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయమని అధికారులు కోరారు.
Rahul Gandhi: మోదీపై పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సవాల్ చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు నేడు సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. న్యాయనిపుణులను సంప్రదించి ఇప్పటికే ఆయన వ్యాజ్యం తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది.