కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వస్తే నందిని బ్రాండ్ ను మరింత శక్తివంతం చేస్తుందని.. ఇతర రాష్ట్రాల నుంచి మరో కో ఆపరేటివ్ రాదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. కర్ణాటక పాల సమాఖ్య నేతృత్వంలోని నందిని పాలను గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ పాలలో విలీనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎన్నికల వేళ మాటల యుద్దం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్యలు చేసింది.
Also Read : Bhatti Vikramarka : కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం జనగణనను వెంటనే మొదలు పెట్టాలి
మైసూర్ లో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ప్రియాంక గాంధీ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే కర్ణాటకను అభివృద్దిలో పరుగులు పెట్టిస్తామని, కర్ణాటక పాల సమాఖ్యను మరింత శక్తివంతం చేస్తామని వెల్లడించారు. కర్ణాటకలో గతంలో ఏ ప్రభుత్వం ప్రజల జీవితాలను మెరుగుపర్చిందో ఆలోచించుకుని మళ్లీ ఆ ప్రభుత్వానికే అధికారం అప్పగించాలని ప్రియాంక గాంధీ కోరారు.
Also Read : Burkina Faso: బుర్కినా ఫాసోలో నరమేధం.. 60 మంది దుర్మరణం
40 శాతం కమీషన్ తో కర్ణాటకలోని బీజేపీ సర్కార్ రూ. 1.5 లక్షల కోట్లు దోచుకుంది. ప్రజలు పేదలుగానే ఉండాలని బీజేపీ భావిస్తోంది. ఇలా ఉంటేనే ప్రజలు తమను ప్రశ్నించబోరని బీజేపీ అనుకుంటోందని ప్రియాంక గాంధీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం దోచుకున్న డబ్బుతో 100 ఎయిమ్స్ నిర్మించవచ్చు. పేద ప్రజలకు 30 లక్షల ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు.. 750 కిలో మీటర్ల మెట్రో లైన్లు వేయవచ్చు అంటూ ప్రియాంక గాంధీ విమర్శించింది. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు మద్దతు చెబుతుంది. వారి నుంచి జీఎస్టీ కూడా వసూలు చేయట్లేదు.. ప్రజలు వాడే నిత్యావసరాల నుంచే జీఎస్టీ వసూలు చేస్తోంది అని ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.