కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. వరంగల్ జిల్లా హనుమకొండలో కార్మికుల నిరసనకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మద్దతు తెలిపారు. పలుచోట్ల కార్మికుల ర్యాలీలు నిర్వహించారు. మరోవైపు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.సిద్దిపేట పట్టణంలో కేంద్రప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించాయి కార్మిక సంఘాలు. ఆదిలాబాద్ లో బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర ముందు ఉద్యోగుల…
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న ప్రైవేటీకరణకు నిరసనగా ఆందోళనలను చేపట్టేందుకు భారతీయ మజ్దూర్ యూనియన్ సిద్ధమైందని ఆ సంఘం జాతీ ఉపాధ్యాక్షుడు మల్లేష్ అన్నారు. ఈ మేరకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాచిగూడలోని జాగృతి భవన్‌లో సంఘ్ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసే కుట్ర జరుగుతుందన్నారు. Read Also:నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు పనిచేయకుంటే పక్కకు తప్పుకోండి: చంద్రబాబు ఎల్‌ఐసీలోని లక్ష కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకోవడంవల్ల ఎల్‌ఐసీ మనుగడ…
భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ చేయనున్నారని వస్తున్న వార్తలపై కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. భారత ఐకానిక్ అయిన రైల్వేలను ప్రైవేటీకరణ చేయనున్నామని లేదా విక్రయిస్తున్నామని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. భవిష్యత్‌లోనూ అలాంటి నిర్ణయం ఉండదని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే అనేది క్లిష్టమైన వ్యవస్థ అని… రైల్వేలను ప్రైవేటీకరించే విషయంపై కేంద్రం ఎలాంటి చర్చలు జరపడంలేదని ఆయన పేర్కొన్నారు. కాగా గతంలోనూ రైల్వేల…
బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాజేష్ టికాయత్ హెచ్చరించారు. దేశ ప్రజల మధ్య ఐక్యతను విడదేసేందుకు వారు ఎంతకైనా తెగిస్తారని ఆయన విమర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారం భించి ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలకు రాలేదని టికాయత్ ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం చర్చలకు రావాలని, లేదంటే నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని ఆయన తెలిపారు. దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని…
వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దేశంలో 13 ఎయిర్‌పోర్టులను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. కేంద్రం అమ్మేయాలని భావిస్తున్న 13 ఎయిర్‌పోర్టుల్లో 6 పెద్దవి, 7 చిన్నవి ఉన్నాయి. పెద్ద విమానాశ్రయాల జాబితాలో అమృత్ సర్, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, తిరుచ్చి, వారణాసి ఉన్నాయి. చిన్న ఎయిర్‌పోర్టుల జాబితాలో సేలం (తమిళనాడు), జలగాం (ఛత్తీస్‌గఢ్),…
దేశవ్యాప్తంగా బీసీల మీద కుట్ర జరుగుతోందని.. అంతా అప్రమత్తంగా వుండి ఎదుర్కోవాలన్నారు ఆర్ కృష్ణయ్య. హుజూరాబాద్ లోనే కాదు… దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ దోపిడీని ఎత్తిచూపిస్తామన్నారు. అన్ని రాష్ట్రాల్లో దండోరా వేస్తాం అన్నారు ఆర్ కృష్ణయ్య. పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల మీద కనిపించని కుట్ర జరుగుతోందని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారన్నారు. పేద వర్గాలను లేబర్ గా ఉంచాలన్నదే కేంద్రం కుట్రగా కనిపిస్తోందన్నారు.…
దేశంలో కమ్యూనిస్టులకు కంచుకోట ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒక్కటి. కేరళీయులు రాజకీయాల్లో విభిన్న వైఖరిని అవలంభిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నపార్టీ మరోసారి అధికారంలోకి రావడం అనేది కష్టం. అలాంటిది గత ఎన్నికల్లో పినరయి విజయన్ వరుసగా రెండోసారి విక్టరీ సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఎన్నికల ముందు ఆయనపై విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా కేరళీయులు పినరయి వైపే మొగ్గుచూపారు. దీంతో కేరళకు ఆయనే మరోసారి సీఎం అయ్యారు. పినరయి విజయన్…