డిసెంబరు 8 బుధవారం తమిళనాడులోని కూనూర్ సమీపంలో జరిగిన చాపర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది సైనికులు మరణించారు. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌కు దేశం మొత్తం సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తోంది. రావత్ వీరమరణానికి చిత్రసీమ కూడా సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం వ్యక్తం చేసింది. మోహన్‌లాల్, చిరంజీవి, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి దక్షిణాది ప్రముఖులు…
పలువురి బాటలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా డిజటల్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అందులో భాగంగా తన తొలి డిజిటల్ సిరీస్‌ను ప్రకటించాడు. ‘బిస్కట్ కింగ్’ టైటిల్‌తో రాబోతున్న ఈ సిరీస్ రాజన్ పిళ్లై జీవితం ఆధారంగా రూపొందనుంది. బ్రిటానియా ఇండస్ట్రీస్‌లో వాటా ఉన్న ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త రాజన్ పిళ్లై. అయితే మోసం, నమ్మక ద్రోహం కేసులో అరెస్టయి తీహార్ జైలులో 1995లో చనిపోయాడు. రాజన్‌ను ‘బిస్కెట్ బారన్’, ‘బిస్కెట్ కింగ్’ అని పిలిచేవారు. ఇప్పుడు…
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘అంధదూన్’ రీసెంట్ గా తెలుగులో రీమేక్ అయినా సంగతి తెలిసిందే. నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈచిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈ సినిమా మలయాళంలో కూడా తెరకెక్కుతోంది. రవి కె.చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. కథానాయికగా రాశి ఖన్నా నటించింది. బాలీవుడ్ లో ‘టబు’ చేసిన పాత్రను మలయాళంలో మమతా మోహన్ దాస్ చేసింది. ఇక మమతా…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జీవిత ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల అధికారికి లేఖ రాయడంతో మరో వివాదం మొదలైంది. మా సభ్యులను జీవిత మభ్యపెడుతున్నారంటూ పృథ్వీ తన లేఖలో ఆరోపించారు. గతంలో జనరల్ సెక్రటరీ పదవిలో ఉన్న జీవిత, తనకు ఓట్లేస్తేనే ప్రయోజనాలు ఉంటాయని చెబుతోందని.. ఆమె నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ వెల్లడించారు. ఆమెపై క్రమశిక్షణ కమిటీ ద్వారా చర్యలు తీసుకోవాలని కోరారు. జీవిత మా ఎన్నికల్లో…
మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమా మల్లూవుడ్ బాక్సాఫీస్ హిట్ టీ నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు చిరంజీవి. ఇదిలా ఉంటే ‘లూసిఫర్’ తర్వాత మరోసారి కలసి సినిమా చేస్తున్నారు మోహన్ లాల్, పృథ్వీరాజ్. ‘బ్రో డాడీ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. 44 రోజుల పాటు ఏకధాటిగా జరిపిన షెడ్యూల్స్ తో సినిమాను పూర్తి…
భార్యలతో కలిసి స్టార్ హీరోలంతా ఒకేచోట చేరారు. మాలీవుడ్ స్టార్ హీరోలు ఫహద్ ఫాసిల్, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ వారి భార్యలతో కలిసి తీసుకున్న ఓ గెట్ టు గెదర్ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. తెలుగువారికి కూడా సుపరిచితురాలైన స్టార్ హీరోయిన్ నజ్రియా నాజిమ్ ఈ పిక్ ను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దుల్కర్ సల్మాన్, అతని భార్య అమల్ సుఫియా, పృథ్వీరాజ్, ఆయన భార్య సుప్రియా మీనన్, ఫహద్ ఫాసిల్…
మలయాళ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘కోల్డ్ కేస్’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 30న స్ట్రీమింగ్ కాబోతోంది. నిజానికి దీనిని మొదట థియేటర్లలో విడుదల చేసిన తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాకపోవడంతో మూవీ మేకర్స్ అమెజాన్ ప్రైమ్ కు హక్కులు ఇచ్చేశారు. దాంతో ఈ నెల 30న దీనిని స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అమెజాన్ సంస్థ తెలియచేసింది. చాలా కాలం గ్యాప్…
అక్షయ్ కుమార్ నటిస్తోన్న తొలి చారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్’. ‘చివరి హిందూ సమ్రాట్’గా చరిత్రలో నిలిచిపోయిన ఆ రాజ్ పుత్ మహావీరుడు త్వరలో వెండితెరపై దర్శనం ఇవ్వనున్నాడు. మహారాజు పృథ్వీరాజ్ గా అక్షయ్, ఆయన ప్రియమైన రాణి సంయోగితగా మానుషీ చిల్లర్ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే మాజీ మిస్ వరల్డ్ బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో రాబోతోంది ‘పృథ్వీరాజ్’ మూవీ. అయితే, ఇప్పుడు ఈ హిస్టారికల్…
అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో సీనియర్ యాక్టర్. స్టార్ గా ఎదిగిన ఆయన దశాబ్దాలుగా నటిస్తున్నాడు. అయితే, ఆయన ఖాతాలో ఎన్నో సినిమాలున్నా ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్కటి కూడా చారిత్రక చిత్రం లేదు. కాకపోతే, ప్రతిష్ఠాత్మక యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రస్తుతం ‘పృథ్వీరాజ్’ సినిమా నిర్మిస్తోంది ఖిలాడీ కుమార్ తో! ఇది మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్, ఆయన పట్టుపురాణి సంయుక్తల ప్రేమగాథ. అక్షయ్ కెరీర్ లో తొలి చారిత్రక చిత్రం!తన ఫస్ట్ హిస్టారికల్ మూవీ చేస్తోన్న…