30న ఓటీటీలో పృథ్వీరాజ్ ‘కోల్డ్ కేస్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘కోల్డ్ కేస్’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 30న స్ట్రీమింగ్ కాబోతోంది. నిజానికి దీనిని మొదట థియేటర్లలో విడుదల చేసిన తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాకపోవడంతో మూవీ మేకర్స్ అమెజాన్ ప్రైమ్ కు హక్కులు ఇచ్చేశారు. దాంతో ఈ నెల 30న దీనిని స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అమెజాన్ సంస్థ తెలియచేసింది. చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ సినిమా కోసం మళ్ళీ పృథ్వీరాజ్ పోలీస్ దుస్తులు ధరించాడు. కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన ఓ హత్యకు సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సత్యజిత్ ఐపీఎస్ గా పృథ్వీరాజ్ నటిస్తున్నాడు. తను బాలక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా `అరువి’ ఫేమ్ అదతి బాలన్ నటిస్తోంది. ఈ సినిమాను సినిమాటోగ్రాఫర్ జోమో టి. జాన్, ఎడిటర్ షమీర్ ముహమ్మద్, ఆంటో జోసెఫ్ సంయుక్తంగా నిర్మించారు. జోమో… గిరీష్ గంగాధరన్ తో కలిసి సినిమాటోగ్రఫీ అందించగా, షమీర్ ముహమ్మద్ ఎడిటింగ్ చేస్తున్నాడు.

Also Read
తాజావార్తలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!