PM Modi: నా కుటుంబం కోసమే రోజుకు 12 గంటలు పని చేస్తున్నా.. మోడీ కీలక వ్యాఖ్యలు
- కువైట్‌లోని గల్ఫ్ స్పీక్ లేబర్ క్యాంపును సందర్శించిన మోడీ
- భారతీయ కార్మికులతో ముచ్చట్లు
- కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ కువైట్‌లోని గల్ఫ్ స్పీక్ లేబర్ క్యాంపును సందర్శించారు. అక్కడున్న భారతీయ కార్మికులతో సంభాషించారు. ఈ సందర్భంగా, భారతదేశంలో చౌకైన డేటా (ఇంటర్నెట్) ఉందన్నారు. ప్రపంచంలో ఎవరితోనైనా ఆన్‌లైన్‌లో మాట్లాడాలనుకుంటే, ఖర్చు చాలా తక్కువ అని ప్రధాని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ కు కూడా తక్కువే అని తెలిపారు.
నేను కూడా 12 గంటలు పని చేస్తాను – ప్రధాని మోడీ
“నేను అభివృద్ధి చెందిన భారతదేశం 2047 గురించి మాట్లాడుతున్నాను. అప్పటి వరకు సుదూర ప్రాంతాల నుంచి పని చేయడానికి వచ్చిన మీరు కూడా మీ గ్రామంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా నిర్మించాలో ఆలోచిస్తారు. ఈ ఆకాంక్షే నా దేశానికి బలం. మన రైతులు ఎంత కష్టపడుతున్నారో రోజంతా ఆలోచిస్తూ ఉంటాను. పొలాల్లో మన కూలీలు ఎంత కష్టపడి పని చేస్తారు. వీళ్లంతా 10 గంటలు పని చేస్తే నేను కూడా 11 గంటలు పని చేయాలి అనిపిస్తుంది. వాళ్ళు 11 గంటలు పనిచేస్తే నేను కూడా 12 గంటలు పని చేయాలని ఉంటుంది. రెండవది మీరు మీ కుటుంబం కోసం కష్టపడుతున్నారా లేదా? నేను కూడా నా కుటుంబం కోసం పని చేస్తున్నాను. మా కుటుంబంలో 140 కోట్ల మంది ఉన్నారు. కాబట్టి నేను కొంచెం ఎక్కువ కష్టపడి పని చేయాలి.” అని ప్రధాని తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
- One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
అభివృద్ధి అంటే మంచి రోడ్లు, మంచి విమానాశ్రయాలు కాదు..
“నాకు అభివృద్ధి అంటే మంచి రోడ్లు, మంచి విమానాశ్రయాలు, మంచి రైల్వే స్టేషన్లు మాత్రమే కాదు. నిరుపేదలకు కూడా వారి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని కోరుకుంటున్నా. 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించడమే మా లక్ష్యం. పేదలకు శాశ్వత ఇళ్లు ఉండాలి. ఇప్పటి వరకు 4 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చాం. అందులో కనీసం15-16 కోట్ల మంది అందులో నివసిస్తారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించేందుకు కృషి చేస్తున్నాను.” అని మోడీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
-
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!