✍ నేటి నుంచి ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ సంఘాల సమ్మె.. పీఆర్సీ అమలు సహా 71 డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన.. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్న ఉద్యోగులు✍ ఏపీలో నేటి నుంచి ఏడాది పాటు గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించిన జగన్ సర్కారు✍ 37వ రోజుకు చేరిన రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర… ఈరోజు నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ప్రారంభం… వల్లివేడు మీదుగా చిత్తూరు…
రష్యా అధినేత పుతిన్ భారత పర్యటనలో కీలక ఒప్పందాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ప్రధాని మోదీ-పుతిన్ కీలక ఒప్పందాలపై చర్చలు జరిపారు. రక్షణ, వాణిజ్య, ఇంధనం, పెట్టుబడులు, టెక్నాలజీ రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. నౌకాయానం, అనుసంధాన రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న S-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ డెలివరీపై మోదీ-పుతిన్ మధ్య చర్చలు జరిగాయి. కాగా గడిచిన మూడు దశాబ్దాలుగా భారత్-రష్యా మధ్య…
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది 1950 జనవరి 26. రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకుని ఇవాళ్టికి 72 ఏళ్లు పూర్తవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. బ్రిటిషర్ల కబంధ హస్తాలనుంచి మనం బయటపడింది ఆగస్టు 15, 1947 .. కానీ మనల్ని మనం పాలించుకునేందుకు ఒక విధానం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా, ఒక లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది ఆ తర్వాతే. దేశాన్ని ఒకే తాటిపై నడిపించేది రాజ్యాంగం.…
దేశవ్యాప్తంగా వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత రావడంతో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుని వాటిని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. రైతు చట్టాల ఉపసంహరణలో ప్రధాని మోదీ రాజనీతిని ప్రదర్శించారని పవన్ కొనియాడారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ చట్టాలు రైతుల ఆమోదం పొందలేకపోయాయని మోదీ గ్రహించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గురునానక్ జయంతి…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన… మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇవాళ జాతిని ఉద్దేశించి… ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంగించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ చట్టాలపై కీలక ప్రకటన చేశారు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూన్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ…
ఈనెల 15న ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భగవాన్ బిర్సాముండా జ్ఞాపకార్థం జంబూరి మైదాన్‌లో నిర్వహించే జన్ జాతీయ గౌరవ దివస్‌లో మోదీ పాల్గొంటారు. భోపాల్‌లో ప్రధాని మోదీ కేవలం నాలుగు గంటలు మాత్రమే గడపనున్నారు. దీని కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా రూ.23 కోట్లను ఖర్చు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులను ఈ సభకు తరలించేందుకు ప్రభుత్వం రూ.13 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. Read Also: ఖాతాదారులకు…
ఆర్బీసీ కస్టమర్-సెంట్రిక్ కార్యక్రమాలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రెండు కొత్త పథకాల కింద, పెట్టుబడిదారులు క్యాపిటల్ మార్కెట్‌ను సులభంగా మరియు సురక్షితంగా యాక్సెస్ చేయగలరని అన్నారు.. ఆర్బీఐ రిటేల్ డైరెక్ట్ స్కీమ్‌తో పాటు రిజర్వ్ బ్యాంక్-ఇంటగ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ స్కీమ్‌ను ఆవిష్కరించిన మోడీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కస్టమర్ కేంద్రీకృతమైన ఈ రెండు కొత్త స్కీమ్‌ల వల్ల పెట్టుబడుల రంగం విస్తరిస్తుందన్నారు. దీంతో మూలధన మార్కెట్ మరింత సులువు, సురక్షితం అవుతుందన్నారు. ప్రభుత్వ సెక్యూర్టీ మార్కెట్‌లో పెట్టుబడి…
భారత ప్రధాని మోదీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ట్విట్టర్‌లో 2021 సంవత్సరానికి ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ప్రధాని మోదీ రెండో స్థానంలో నిలిచారు. ఈ విషయాన్ని వినియోగదారుల నిఘా కంపెనీ ‘బ్రాండ్ వాచ్’ తమ వార్షిక నివేదిక ద్వారా వెల్లడించింది. మొత్తం 50 మంది వ్యక్తులతో విడుదల చేసిన ఈ జాబితాలో తొలి స్థానంలో అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో మోదీ, మూడో స్థానంలో సింగర్…
మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. నల్లధనం కట్టడి చేయడం కోసం అంటూ 2016, నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్ల రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2వేలు, రూ.100, రూ.200, రూ.50, రూ.20, రూ.10 నోట్లను తీసుకువచ్చింది. కానీ ఐదేళ్లు గడిచినా నల్లధనం వెనక్కి తీసుకురావడంలో మోదీ సర్కార్ దారుణంగా విఫలమైంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు, నెటిజన్లు మోదీ సర్కార్ వైఫల్యంపై…
ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. కేదార్‌నాథ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఉత్తరాఖండ్ చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది.. ఆ తర్వాత కేదార్‌నాథ్ వెళ్లారు.. మొదట కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు.. ఆలయంలో ప్రార్థనలు నిర్వహించిన తర్వాత, ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 12 అడుగుల ఆది గురు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు.. కాగా, 2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఆదిశంకరాచార్యుల సమాధి ధ్వంసమైంది.. ఆ…