హైదరాబాద్‌లో నిన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా పార్టీ అగ్ర నేత, ప్రధాని మోడీ తన ప్రసంగంలో 'P2 to G2' అనే మోడల్ గురించి ప్రస్తావించారు.
ప్రధాని నరేంద్ర మోడీ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రేపు హైదరాబాద్ రానున్న నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య హోర్డింగుల వార్ నడుస్తోంది. మోడీ రాకను వ్యతిరేకిస్తూ గులాబీ పార్టీవాళ్లు క్రియేటివ్‌గా హోర్డింగులను ఏర్పాటుచేస్తున్నారు. ‘సాలు మోడీ.. సంపకు మోడీ’ అని రాసి ఉన్న బ్యానర్లను, హోర్డింగ్‌లు ఇప్పటికే నగరంలోని పలు చోట్ల ఏర్పాటు చేశాయి.. ఇది హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాలేదు.. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇలాంటి ఫ్లెక్సీలే దర్శనమిచ్చాయి. అయితే,…
ప్రధాని నరేంద్ర మోడీ భద్రత కోసం పోలీస్ రివ్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు.. 4 అంచల భద్రత ఏర్పాటు చేశారు.. వీఐపీ సెక్యూరిటీ, అప్పర్, లోయర్, మిడిల్ ఇలా ప్రధాని మోడీ చుట్టూ ఎస్పీజీ ఫోర్స్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సాయుధ బెటాలియన్ దళాలు మోహరించనున్నాయి..
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ వచ్చేనెలలో ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు జూలై 4న ప్రధాని మోదీ భీమవరంలో పర్యటించి అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. జూలై 4న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి భీమవరం వెళ్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. తొలుత రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి భీమవరం వెళ్తారని భావించినా సెక్యూరిటీ కారణాల వల్ల ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు.…
ఏపీలో వేసవి సెలవుల అనంతరం జూలై 4న పాఠశాలలు రీఓపెన్ కావాల్సి ఉంది. ఈ మేరకు గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ప్రభుత్వ పాఠశాలలు ఒకరోజు ఆలస్యంగా అంటే జూలై 5న పున:ప్రారంభం కానున్నాయి. జూలై 4న ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మంగళగిరి పరిధిలో కొత్తగా నిర్మించిన ఎయిమ్స్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో స్కూళ్ల రీ ఓపెన్‌ను వాయిదా వేసి జూలై 5న పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.…
అగ్నిపథ్ పథకం ఇప్పుడు కాకరేపుతోంది.. ఓవైపు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, బంద్‌లు కొనసాగుతుంటే.. మరోవైపు ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా నోటిఫికేషన్లకు విడుదల చేస్తోంది కేంద్రం.. దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌పై ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశం నిర్వహించగా.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు.. రేపు అనగా మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమావేశం కాబోతున్నారు ప్రధాని మోడీ.. కర్ణాటక పర్యటనలో అగ్నిపథ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసిన ఆయన.. కొన్ని…
కరోనా పరిస్థితులపై అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పెట్రోల్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమని మోదీ ఆరోపించారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినా.. రాష్ట్రాలు తగ్గించలేదన్నారు. రాష్ట్రాల తీరు వల్లే ధరలు పెరుగుతున్నాయని మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించాలని.. అప్పుడే ప్రజలపై పెట్రోల్ ధరల…
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ సరిహద్దులోని సాంబా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు రూ.20వేల కోట్ల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఢిల్లీ-అమృత్ సర్-కాత్రా ఎక్స్ ప్రెస్ వేకు ఆయన శంకుస్థాపన చేశారు. పల్లీ గ్రామంలో 500 కిలోవాట్ల సౌర విద్యుత్…