ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 72వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఏటా ప్రత్యేక రీతిలో జన్మదినం జరుపుకునే మోడీ.. ఈసారి చీతాల సమక్షంలో రోజంతా గడపాలని నిర్ణయించుకున్నారు.
Modi Birthday: సెప్టెంబర్ 17న భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ యజమాని వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈనెల 17న తన రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్లకు థాలీ పోటీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ పోటీలో గెలిచిన వారికి రూ.8.5 లక్షల నగదు అందజేస్తానని తెలిపాడు. అయితే కొన్ని షరతులు పెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ఆర్డోర్ 2.1 అనే రెస్టారెంట్‌లో మోదీ బర్త్ డేను పురస్కరించుకుని…
గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్, మార్ట్‌లో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ డెయిరీ ఫెడరేషన్ వరల్డ్ డెయిరీ సమ్మిట్ 2022ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు.
జీవితంలో ఎన్నో బాధలు ఉన్నప్పటికీ.. 75 శాతం మేధో వైకల్యంతో పాటు డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఓ 14 ఏళ్ల బాలిక జీవితాన్ని యోగా మార్చేసింది. ఆమె ఎవరో కాదు 'రబ్బర్ గర్ల్'గా పేరొందిన అన్వీ విజయ్ జంజారుకియా. ఆమె నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధాని ముందు అన్వీ యోగాను ప్రదర్శించారు.
వచ్చే నెలలో జరగనున్న జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నట్లు జపాన్ మీడియా బుధవారం వెల్లడించింది. జపాన్ ప్రభుత్వం సెప్టెంబర్ 27న అబేకు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఉచిత పథకాల అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెబుతున్నారు..? ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చేస్తున్నదేంటి? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చగా మారింది.. దీనిని.. Yogi oppose Modi హాష్ ట్యాగ్ జోడిస్తూ.. కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.. అయితే, ఉచిత సంక్షేమ పథకాల వల్ల అభివృద్ది జరగదు అని ప్రధాని చెబుతూ వస్తున్నారు.. ఉచిత పథకాలతో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాయని విమర్శించిన ప్రధాని.. ఉచితాలు దేశాభివృద్ధిని…
ఆగస్టు 5న నల్లబట్టలు ధరించి 'ధరల పెరుగుదల'పై కాంగ్రెస్ చేపట్టిన నిరసనపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కొందరు నిరాశ, నిస్పృహల్లో మునిగి చేతబడిని ఆశ్రయిస్తున్నారంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్తులు గతంతో పోలిస్తే భారీగానే పెరిగాయి. ప్రస్తుతం ఆయన వద్ద రూ.2.23 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అందులో ఎక్కవ భాగం బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. అయితే, ఎలాంటి స్థిరాస్తులు లేవు. గాంధీనగర్‌లో గతంలో కొనుగోలు చేసిన భూమిని మోడీ విరాళంగా ఇచ్చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం గురువారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి వచ్చిన సీఎం మమతా బెనర్జీ నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు.