ఇప్పటి వరకు వస్తున్న సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ ఏప్రిల్ 21వ తేదీన సూర్యాస్తమయం తర్వాత ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. సంప్రదాయం ప్రకారం.. ఎర్రకోట యొక్క ప్రాకారము నుండి ప్రధానులు స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కానీ, సిక్కుల మతగురువు తేజ్‌బహుదూర్400వ జయంతిని పురస్కరించుకుని.. ఎర్రకోటలో సంప్రదాయానికి భిన్నంగా.. సూర్యాస్తమయం తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు నరేంద్ర మోడీ.. అయితే, స్వాతంత్ర దినోత్సవం వేడుకల సమయంలో ప్రసంగించే ప్రదేశంలో కాకుండా…
ప్రధాని మోదీ హత్యకు కొందరు దుండగులు కుట్ర పన్నారు. ఈ మేరకు ముంబైలోని ఎన్‌ఐఏ కార్యాలయానికి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. మోదీ హత్యకు 20 మందితో స్లీపర్‌సెల్స్ రెడీగా ఉన్నట్లు ఈ-మెయిల్‌లో దుండగులు హెచ్చరించారు. 20 కేజీల ఆర్‌డీఎక్స్ కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. దీంతో వెంటనే కేంద్ర భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. బెదిరింపు ఈ-మెయిల్‌పై కేంద్ర హోంశాఖ అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ-మెయిల్‌ను ఎవరు పంపారో కేంద్ర భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి.
యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఈ మేరకు ఈనెల 25న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. యోగి ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా విచ్చేయనున్నారు రాజకీయ…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విజయం అని ఆయన అభివర్ణించారు. దేశంలో తమ పాలనకు ప్రజలు ఇచ్చిన బహుమతి అని తెలిపారు. ఈసారి హోలీ మార్చి 10నే మొదలైందని.. ఇవాళ్టి ఫలితాల్లో గొప్ప సందేశం ఉందన్నారు. ప్రజల నమ్మకం, విశ్వాసం పొందేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేశారు కాబట్టి ఇది కార్యకర్తల విజయమని మోదీ తెలిపారు. దేశంలోని నాలుగు వైపులా ప్రజలు…
మహారాష్ట్రలో రెండో అతి పెద్దనగరం పూణెలో మెట్రోరైలు సేవలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ ఆదివారం నాడు పూణె మెట్రోరైలు ప్రాజెక్టును ప్రారంభించారు. తొలుత పుణె మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. 9.5 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని పూణె మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అనంతరం గర్వారే మెట్రో స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపి పూణె మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా…
ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఓవైపు చర్చలు.. మరో వైపు యుద్ధం ఇలా.. రెండూ సాగుతున్నాయి.. మరోవైపు ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం.. ఉక్రెయిన్‌లో ఇంకా 15 వేల మంది భారతీయులు చిక్కుకున్నారు.. వారంతా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు తరలివస్తున్నారు.. దాడులు జరుగుతుండడంతో భయపడిపోతున్నారు.. పోలండ్‌లో భారతీయులపై అక్కడి స్థానిక పోలీసులు దాడులు చేశారు.. దీంతో ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు మంత్రులను పంపాలని భావిస్తోంది కేంద్రం. ఉక్రెయిన్ సంక్షోభంపై…
మాతృభాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాతృభాషలో విద్యాబోధన చిన్నారుల మానసిక అభివృద్ధికి దోహద పడుతుందని పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మాతృభాషలో బోధన కొనసాగుతోందన్నారు. వైద్య, సాంకేతిక కోర్సులు సైతం మాతృభాషలో బోధించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రతిపాదించిన కార్యక్రమాల అమలుపైనా వెబినార్‌లో మోదీ ప్రసంగించారు. విద్యాశాఖకు సంబంధించి ఐదు అంశాలపై దృష్టిసారించినట్లు తెలిపారు. జాతీయ…
దేశంలో ఉన్న దళితుల బాగోగుల కోసమే కొత్త రాజ్యాంగం రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. దళితుల రిజర్వేషన్లు 19% పెంచడానికి, BCల కులగణన కోసం, దేశమంతా దళితబంధు పెట్టడం కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నానని తెలిపారు. దేశం బాగుపడాలంటే.. అందరికీ సమాన హక్కుల కోసం రాజ్యాంగం మారాలని అభిప్రాయపడ్డారు. 77 శాతం దేశ సంపద 90 శాతం మంది దగ్గర ఉండాలనే కొత్త రాజ్యాంగం కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు…
బీజేపీపై మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని.. లేకపోతే తీవ్రస్థాయిలో నష్టం తప్పదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే బీజేపీ చేసిన పాపాలు ఎక్కువైపోయాయని, మోదీకి ఇచ్చిన సమయంలో 80 శాతం అయిపోయిందని తెలిపారు. 12శాతం జీడీపీ వృద్ధి ఉండే ఎక్కడైనా ఆరేళ్లలో రెట్టింపు అవుతుందని కేసీఆర్ చెప్పారు. ఇందుకోసం ప్రధాని మోదీ అవసరం దేశానికి లేదని.. 2025 నాటికి రూ.5లక్షల కోట్ల ఆర్థిక వృద్ధికి ప్రధాని, ఆర్థిక మంత్రి…