గురువారం రోజు నామినేషన్ల పరిశీలన పూర్తి చేసిన ఎన్నికల సంఘం అధికారులు.. ప్రమాణాలకు అనుగుణంగా లేని నామినేషన్లను తిరస్కరించారు.. రాష్ట్రపతి ఎన్నికల ప్రధానంగా బరిలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ పత్రాలకు ఓకే చెప్పారు..
రాష్ట్రపతి ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇప్పటికే ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఆదివాసీ మహిళ, మాజీ గవర్నర్ ద్రౌపతి ముర్మును ఖరారు చేశారు. అయితే సమీకరణాలు ఎలా ఉన్నా ద్రౌపతి ముర్ము విజయం సాధిస్తుందనేది ఖాయం. ఇప్పటికే వైసీపీ, బిజూ జనతాదళ్ పార్టీలు ముర్ముకు మద్దతు ప్రకటించాయి. దీంతో ఎన్డీయే బలంలో కలుపుకుని 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లే ద్రౌపతి ముర్ముకు పడుతాయి. అయితే బీజేపీ మాత్రం రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవం చేసేలా ప్రయత్నాలు…
రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వైఖరేంటి? అని ప్రశ్నించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. రాష్ట్రపతి ఎన్నికపై ప్రతిపక్ష పార్టీలు సమావేశం అవుతున్నాయి… కానీ, టీడీపీ, వైసీపీల వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో లౌకిక వాదానికి పెను ప్రమాదం సంభవించిందన్న ఆయన.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మోడీ పాలన సాగిస్తున్నారు.. మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు జగన్ మద్దతు ఇవ్వాలని సూచించారు. ఇటీవల మోడీని కలిసిన వైఎస్ జగన్…
అధికారిక వాహనాల్లో రేపులు జరిగితే కూడా పట్టదా..? అంటూ టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో రేవంత్ మాట్లాడుతూ.. అధికారిక వాహనాల్లో కూడా అత్యాచారాలు జరిగినా చర్యలు తీసుకోవడం లేదు అంటే కెసిఆర్ ప్రోస్తహిస్తున్నట్టే అని విమర్శలు గుప్తించారు. కెసిఆర్ కో నచ్చితే నజరానా..? లేదంటే శిక్షలు అంటూ మండిపడ్డారు. కెసిఆర్..ఎంఐఎం పాలనలోనే పొత్తు కాదు, అత్యాచారాలు కూడా పొత్తు ల్లోనే చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ నీ ఎందుకు తీసేయడం…
కొంతకాలం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ధ్వజమెత్తుతోన్న సంగతి తెలిసిందే! అవకాశం దొరికినప్పుడల్లా ఆయన ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు వస్తోన్న తరుణంలో, ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఆల్రెడీ కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని సిద్ధం చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే! బీజేపీయేతర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో పలుసార్లు సమావేశమయ్యారు. ఇక జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు వస్తుండడంతో.. ప్రతిపక్ష కూటమి అభ్యర్థిని…