Presidential elections: ఏకగ్రీవం కోసం బీజేపీ ప్రయత్నాలు.. రంగంలోని జేపీ నడ్డా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇప్పటికే ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఆదివాసీ మహిళ, మాజీ గవర్నర్ ద్రౌపతి ముర్మును ఖరారు చేశారు. అయితే సమీకరణాలు ఎలా ఉన్నా ద్రౌపతి ముర్ము విజయం సాధిస్తుందనేది ఖాయం. ఇప్పటికే వైసీపీ, బిజూ జనతాదళ్ పార్టీలు ముర్ముకు మద్దతు ప్రకటించాయి. దీంతో ఎన్డీయే బలంలో కలుపుకుని 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లే ద్రౌపతి ముర్ముకు పడుతాయి. అయితే బీజేపీ మాత్రం రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవం చేసేలా ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే ఈ బాధ్యతను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించారు. ఆయన ఇప్పటికే విపక్షాలకు చెందిన పలువురు నాయకులతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవం చేసేలా ప్రయత్నాలు ప్రారంభించారు. జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని జేడీఎస్ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడతో మాట్లాడారు. వీరితో పాటు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి తో పాటు ఫరూక్ అబ్దుల్లా తో నడ్డా మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపతి ముర్ముకు సపోర్ట్ చేయాలని కోరారు. రాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయం ఉండకూడదని కోరారు.
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
మరోవైపు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము కూడా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. పలు రాజకీయ నాయకులను కలుస్తూ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. బిజూ జనతాదళ్, ఏఐడీఎంకే పార్టీలకు చెందిన నేతల్ని కలిశారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు కూడా కోరనున్నట్లు తెలిసింది. దేశ వ్యాప్తంగా రేపటి నుంచి పర్యటిస్తూ పలు పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు ముర్ము.
ఇదిలా ఉంటే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలుస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్డీయేతర పార్టీలు యశ్వంత్ సిన్హాకు ఎంతమేర మద్దతు ఇస్తాయో చూడాలి. అయితే ఇటీవల మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన విపక్షాల సమావేశానికి కాంగ్రెస్ హాజరుకావడంతో ఆప్, టీఆర్ఎస్ పార్టీలు హాజరుకాలేదు.
తాజావార్తలు
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!