మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అంటూ ప్రశ్నించారు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది
దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించనున్నారా? అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? తాజా పరిణామాలపై ఆమ్ ఆద్మీ ప్రభుత్వ అనుమానాలు నిజమేనా? ఆప్ కీలక నేత వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 1 నుంచి జైల్లోనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు బెయిల్ లభించలేదు. ఇదే కేసులో గతంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా జైలుకు వెళ్లి…
Sandeshkhali Clashes: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సందేశ్‌ఖలీ ప్రాంతం అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్, అతని గుండాల అకృత్యాలపై అక్కడి మహిళలు, యువత భగ్గుమంటోంది. నేరస్తులను వెంటనే అరెస్ట్ చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనలకు బీజేపీ మద్దతు తెలుపుతోంది. మరోవైపు ఈ అల్లర్ల వెనక ఆర్ఎస్ఎస్ ఉందని బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు.
కొంతకాలంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ మధ్య కొనసాగుతున్న లేఖల యుద్ధం ఇప్పుడు ముదిరింది. ముఖ్యమంత్రికి గవర్నర్ శుక్రవారం గట్టి హెచ్చరికలు జారీ చేశారు. గతంలో తాను రాసిన లేఖలకు సమాధానం ఇవ్వకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తానని హెచ్చరించారు.
ఓవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు టెన్షన్ పెడుతున్న వేళ.. వచ్చే ఏడాది యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై నీలినీడలు కమ్ముకున్నాయి… ఇప్పటికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించిన అలహాబాద్ హైకోర్టు… ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, సభలపై ప్రధాని నరేంద్ర మోడీకి కూడా సూచలను చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎప్పుడు వాస్తవాలకు దగ్గర మాట్లాడుతూ.. కొన్ని సార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ రాస్యభసభ సభ్యులు…